Due Date: బర్నింగ్ ఇష్యూపై కమర్షియల్ కోర్ట్‌రూమ్ డ్రామా!
ABN, Publish Date - Oct 06 , 2026 | 02:41 PM
లోమేష్ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్‌గా, ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'డ్యూ డేట్'
లోమేష్ పుడిపెద్ది (lomesh pudipeddi) హీరోగా, జయశ్రీ (jayasri) హీరోయిన్‌గా, ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'డ్యూ డేట్' (Due Date). వరిష్ స్టూడియోస్ పతాకంపై పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా ఆనంద్.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం హైదరాబాద్‌లో మొదలైంది. హీరో, హీరోయిన్ ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్ కోర్ట్ రూమ్ డ్రామా ఇది. ప్రతి మనిషి, ప్రతి నెలా గుర్తుపెట్టుకునే డ్యూ డేట్ చుట్టు వాణిజ్య అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. టైటిల్ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఈ చిత్రంలో ఉంటాయి. 15 రోజుల పాటు ఏకధాటిగా జరిగే షెడ్యూల్‌తో తొలి షెడ్యూల్ పూర్తవుతుంది. తప్పకుండా ఈ చిత్రం అందర్ని ఆలోచింపజేస్తుంది. హృదయాలకు హత్తుకుంటుంది' అన్నారు. ప్రణీత పట్నాయక్, విజ్క్షాని, కృష్ణ భగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: జవ్వాడి నాయుడు, మాటలు: హరీష్ మీనన్, ఎడిటర్: సత్య గిడుటూరి, డీఓపీ: చెంచు జింక.