సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dr Guravareddy: వారితో చూసి యాక్టర్‌ని అనుకోకండి .. ఎముకల డాక్టర్‌నే..

ABN, Publish Date - Jan 25 , 2026 | 01:10 PM

డాక్టర్‌ గురవారెడ్డికి చిత్ర పరిశ్రమతో మంచి అనుబంధం ఉంది. టాలీవుడ్‌ హీరోలు ఎంతోమందికి ఆయన స్నేహితులు. అందరితోనూ చక్కని అనుబంధంతో ఆత్మీయంగా ఉంటారు.

డాక్టర్‌ గురవారెడ్డికి 9DR Guravareddy)చిత్ర పరిశ్రమతో మంచి అనుబంధం ఉంది. టాలీవుడ్‌ హీరోలు ఎంతోమందికి ఆయన స్నేహితులు. అందరితోనూ చక్కని అనుబంధంతో ఆత్మీయంగా ఉంటారు. తాజాగా ఆయన అపురూప దృశ్యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆయన ఎంతో ఇష్టపడే, అనుబంధంతో ఉండే చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జునలను కలిశారు. ఆత్మీయంగా పలకరించుకుని కొంత సమయాన్ని గడిపారు. 'మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం సంక్రాంతికి విడుదలై  భారీ విజయం సాధించిన సందర్భంగా మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో ఓ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌లతోపాటు డా.గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురవారెడ్డి తనకు ఎంతో ఇష్టమైన హీరోల గురించి భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు.



స్వయంకృషి తో వచ్చి,

వెండి తెరపై విందు భోజనంలా వెలిగిపోయే

మెగాస్టార్ చిరంజీవి గారు అయినా,

అక్కినేని పేరుతో ప్రవేశించినా,

అఖండ తెలుగు సినిమా ప్రజానీకానికి రాజులా (కింగ్)

రెపరెపలాడే నాగార్జున గారు అయినా,

కలియుగ పాండవులంటూ ఓనమాలు దిద్దినా,

కృష్ణుడి లాంటి సమ్మోహనం తో, గీత లోని సారాన్ని అవపోసన పట్టి,

ప్రతి ఇంట్లో పెద్ద కొడుకుగా నిలిచిపోయిన వెంకటేష్ గారు అయినా,

వీరందరిలో, వారి బాటలో వారు, వారి తీరులో వారు,

వాళ్ళదైనా చెరగని ముద్ర వేసుకున్నారు!

ఇలా తెలుగు చలన చిత్ర చరిత్రలో, ఎంతో నేర్పుతో

వాళ్ళకంటూ ఒక గూడుని కట్టుకొని,

అందమైన వలలో మనల్ని ఊయలలూపుతూ, ఆనందపరుస్తున్నారు..!

అందుకే, వీరిని కలిసినప్పుడు, ఆడంబరాల తారలలా కాక,

అందమైన సాలీడు కళా కవితల్లా కనిపిస్తారు,

నన్ను (మనల్ని) ప్రేరేపిస్తుంటారు!

‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి పండగకి

తిరిగి పాత రోజులని గుర్తు చేస్తూ బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భాన అద్భుతమైన ఆతిథ్యానికి పెట్టింది పేరైన, స్నేహితుడు-ఆత్మీయుడు మేఘా కృష్ణారెడ్డి గారి ఇంట్లో,

ఈ తెలుగు సినిమా దిగ్గజాలని కలిసి ఇలా ఓ జ్ఞాపకాన్ని పంచుకోగలిగాను!

నన్ను వారితో కలిసి చూసి, ఏదో యాక్టర్ ని అనుకోకండి,

నేను ఎముకల డాక్టర్నే సుమీ... అంటూ  గురవా రెడ్డి'  పెట్టిన పోస్ట్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ప్రస్తుతం ఆయన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

Updated Date - Jan 25 , 2026 | 02:28 PM