సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హీరోయిన్లను నిందించడం ఆపండి.. ఆషికా రంగనాథ్ ఫైర్

ABN, Publish Date - Jun 06 , 2026 | 06:23 PM

సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ చూపిస్తేనే తమ మనుగడ సాగించగలరు.. ఇదే అనాదిగా వస్తోన్న ఆచారం. కానీ, ఇప్పుడు జనరేషన్ మారింది.

Ashika Ranganath

సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ చూపిస్తేనే తమ మనుగడ సాగించగలరు.. ఇదే అనాదిగా వస్తోన్న ఆచారం. కానీ, ఇప్పుడు జనరేషన్ మారింది. హీరోయిన్లు కేవలం మూడు సీన్స్, ఆరు పాటలు అంటూ అనుకోవడం లేదు. పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలనే ఎంచుకుంటున్నారు. అయితే కొంతమంది డైరెక్టర్స్ మాత్రం హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ కోసమే అన్నట్లు కథలు రాస్తున్నారు. అందుకు నిలువెత్తు నిదర్శనం పెద్ది (Peddi) సినిమా. ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అచ్చియమ్మ పాత్ర కేవలం అందాల ఆరబోతకే పరిమితమయ్యింది. ఈ సినిమా రిలీజ్ తరువాత జాన్వీపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. డబ్బు కోసం ఇలాంటి పాత్రలను ఎంచుకోవడం సిగ్గుచేటు అన్నట్లు మాట్లాడుతున్నారు.


ఇప్పటివరకు జాన్వీ చేసినవి రెండు సినిమాలే అయినా అందులో ఆమె పాత్ర కేవలం అందాలను చూపించడమే. అది ఆమె కావాలనే చేసిందని విమర్శిస్తున్నారు. ఇక ఈ వివాదంలో జాన్వీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు హీరోయిన్లు. ఇప్పటికే అనసూయ తనదైన రీతిలో మాట్లాడగా.. మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ సైతం జాన్వీకి సపోర్ట్ గా నిలిచింది. జాన్వీ గురించి తప్పుగా రాసిన ఒక ఆర్టికల్ స్క్రీన్ షాట్ ని పోస్ట్ చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చింది. 'రామ్ చరణ్ లేదా జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ల చిత్రాలలో పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా, కేవలం భారీ రెమ్యునరేషన్ లేదా క్రేజ్ కోసమే హీరోయిన్లు నటిస్తున్నారని, తమను తాము తగ్గించుకుంటున్నారని' తప్పు పట్టారు.


హీరోయిన్లు కేవలం డబ్బు కోసమే నటిస్తున్నారని రాసిన ఆర్టికల్ పై ఆషికా మండిపడింది. హీరోయిన్లను నిందించడం ఆపి, ఇప్పటికీ ఇలాంటి గ్లామర్ పాత్రలే థియేటర్లలో అమ్ముడవుతాయని నమ్ముతున్న సినీ వ్యవస్థను, దర్శకులను తప్పుపట్టాలని చెప్పింది. నటీనటులు ఎప్పుడైనా సరే ఇండస్ట్రీలో తమకు అందుబాటులో ఉన్న అవకాశాల పరిధిలోనే పని చేయాల్సి ఉంటుందని, పెద్ద ప్రాజెక్ట్‌లలో భాగమైతే ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అవుతామని కోరుకోవడంలో తప్పులేదు. ఒకవేళ సినిమాలో మహిళా పాత్రలు సరిగ్గా రాయలేదు అనిపిస్తే.. ఆ బాధ్యత పూర్తిగా కథ రాసే రైటర్లది, దర్శకులదే అవుతుంది తప్ప, ఆ పాత్రను పోషించిన హీరోయిన్లది కాదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Jun 06 , 2026 | 06:37 PM