సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'టాక్సిక్' డైరెక్ట‌ర్.. తెలుగులో చేసిన‌ సినిమా తెలుసా?

ABN, Publish Date - Feb 27 , 2026 | 10:53 AM

యష్ హీరోగా రూపొందుతున్న ‘టాక్సిక్’ సినిమాతో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ పేరు మరోసారి జాతీయ స్థాయిలో వినిపిస్తోంది.

geethu

కన్నడ స్టార్ యష్ హీరోగా రూపొందుతున్న ‘టాక్సిక్’ (Toxic) సినిమాతో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) పేరు మరోసారి జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. అయితే అది తాను డైరెక్ట్ చేస్తోన్న టాక్సిక్ సినిమా విష‌యంలో కాదు. ఆమె బాల న‌టిగా, క‌థానాయిక‌గా అనేక సినిమాల‌లో న‌టించిన విష‌యం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు వ‌స్తోంది. అంతేకాదు గీతూ తెలుగులోనూ ఓ చిత్రం చేసిన సంగ‌తి చాలా మందికి తెలియ‌దు.

వివ‌రాల్లోకి వెళితే.. కేరళలో జన్మించిన గీతూ మోహన్‌దాస్ చిన్న వయసులోనే మలయాళ సినిమాలతో బాలనటిగా కెరీర్ ప్రారంభించారు. తొలి చిత్రంతోనే అవార్డు అందుకుని, తరువాత హీరోయిన్‌గా మంచి గుర్తింపు సాధించారు. ఆపై ద‌ర్శ‌క‌త్వంలోనూ అడుగు పెట్టి ‘లయర్స్ డైస్’తో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఆమె, ‘మూతోన్’తో విమర్శకుల మెప్పు పొందారు.

అయితే... గీతూ మోహ‌న్ దాస్ 2001లోనే వేణు తొట్టెంపూడి హీరోగా ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన కామెడీ చిత్రం ‘వీడెక్కడి మొగుడండీ’ (Veedekkadi Mogudandi)లో శృతి రాజ్‌తో క‌లిసి మ‌రో హీరోయిన్‌గా న‌టించి మెప్పించింది ఆ తర్వాత ఆమె మ‌ల‌యాళంలో బిజీ అయి తెలుగులో నటిగా కొనసాగలేదు.

కాగా.. ఇప్పుడు అదే గీతూ మోహన్‌దాస్, యశ్‌ వంటి పాన్ ఇండియా స్టార్‌ను డైరెక్ట్ చేస్తుండటం ఆసక్తికర అంశంగా మారింది. ఒకప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్‌లో కనిపించిన ఆమె, ఇప్పుడు భారీ యాక్షన్ డ్రామాను బోల్డ్ అండ్ ర‌స్టిక్గా తెర‌కెక్కించ‌డం హాట్ టాపిక్గా మారింది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన టాజ‌ర్‌, గ్లింప్స్ ఔరా అనిపించ‌డ‌మే కాక ఓ లేడీ డైరెక్ట‌ర్ ఇలాంటి సినిమా తీసిందా అనే టాక్ తెచ్చుకుంది.

Updated Date - Feb 27 , 2026 | 11:14 AM