సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జనవరి 12 విడుదల.. డివికి డివికి డిక్కుమ్ ప్రోమో అదిరింది

ABN, Publish Date - Nov 20 , 2026 | 06:55 PM

టాలీవుడ్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ జనవరి 12 విడుదల (January 12 Vidudala). విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా.. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

January 12 Vidudala

టాలీవుడ్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ జనవరి 12 విడుదల (January 12 Vidudala). విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా.. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రమోషన్స్ తోనే హైప్ పెంచిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు ఒక్కో సాంగ్ ని దింపుతూ మరింత హైప్ పెంచుతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి డివికి డివికి అంటూ సాగే సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. 


ఈ పాట ప్రోమోతోనే పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. తాజాగా విడుదలైన డివికి డివికి సాంగ్ ప్రోమోలో కీర్తి సురేష్, కృతి శెట్టి లంగా ఓణీలలో సంప్రదాయబద్ధంగా, ఎంతో అందంగా కనిపిస్తూ స్టెప్పులతో అదరగొట్టారు. భారీ సెట్స్, పూల వర్షం, రంగురంగుల ఆహార్యాల మధ్య సాగే ఈ విజువల్స్ ప్రేక్షకులకు కనులవిందుగా ఉన్నాయి. గెట్ రెడీ గర్ల్స్.. దిస్ వన్స్ ఫర్ యూ అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్.   ఈ ట్రాక్, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇట్టే కనెక్ట్ చేసేలా కనిపిస్తోంది.


ఇక ఈ పాటకు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బీట్స్, హుషారైన ట్యూన్ ప్రోమోకు ప్రాణంగా నిలిచాయి. అనిల్ రావిపూడి మార్క్ ఎనర్జీ, గ్రాండ్ విజువల్స్‌తో పాటు జీవీ ప్రకాష్ మ్యూజిక్ కలవడంతో ఈ పాట చార్ట్‌బస్టర్ హిట్ అవ్వడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. ఫుల్ లిరికల్ వీడియోను నవంబర్ 20 న ఉదయం 11:34 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

Updated Date - Nov 20 , 2026 | 06:59 PM