Tollywood: దివిజా ప్రభాకర్ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్
ABN, Publish Date - Jul 17 , 2026 | 11:33 AM
ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ నటించిన తొలి చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా' శుక్రవారం విడుదల కాగా.. వచ్చే శుక్రవారం ఆమె నటించిన మరో సినిమా 'హే చికీతా' జనం ముందుకు రాబోతోంది.
ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ ఇప్పటికే తెలుగు సినిమా రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. యాటిట్యూడ్ స్టార్ అనే పేరుతో సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ శుక్రవారం 'వెంకట్రామయ్య గారి తాలూకా' సినిమాతో ప్రభాకర్ కుమార్తె దివిజా ప్రభాకర్ సైతం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సతీశ్ అవ్వాల దర్శకత్వంలో ఈ సినిమాను జానపద గాయని కోమల మహీందర్... సోమేశ్ సారిపల్లితో కలిసి నిర్మించారు. ఈ సినిమాలో దినేశ్ కుమార్ హీరోగా నటించారు. మురళీధర్ గౌడ్, సుధ జంటగా నటించిన ఈ మూవీ ప్రధానంగా కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కింది.
ఇదిలా ఉంటే... దివిజా ప్రభాకర్ నటించిన మరో సినిమా 'హే చికిత' సైతం ఇదే నెల 24న విడుదల కాబోతోంది. ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మించిన 'హే చికీతా' మూవీని ధన్ రాజ్ లెక్కల డైరెక్ట్ చేశారు. ఇందులో దివిజతో పాటు అభినవ్ మణికంఠ, తన్మయి ఖుషి ముఖ్య పాత్రలను పోషించారు. ఇలా ఓ నూతన నటి నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కావడం విశేషమే. మరి ఈ రెండు సినిమాలతో దివిజకు నటిగా ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
బొకేలు ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా.. నాలో మార్పు రాలేదు: ఐశ్వర్య రాజేష్
సీఎం విజయ్ పాలనపై వరలక్ష్మి శరత్‌కుమార్ షాకింగ్ పోస్ట్..
నితిన్ ‘హ్యాట్రిక్’ సినిమాలు.. ఈసారైనా హిట్ దక్కేనా