స్వర్గానికి దారి చూపిస్తానంటున్న హాట్ బ్యూటీ
ABN, Publish Date - Jun 06 , 2026 | 02:47 PM
అందాల భామ దివి వద్థ్య (Divi Vadthya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ని ప్రారంభించిన దివి బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అందాల భామ దివి వద్థ్య (Divi Vadthya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ని ప్రారంభించిన దివి బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న దివి, తన నిజాయితీ మరియు స్పష్టమైన మాటతీరుతో ప్రేక్షకులకు దగ్గరయింది. . బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆమెకు గాడ్ ఫాదర్ సినిమాలో ఒక కీలక పాత్రను ఆఫర్ చేయడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఆ సినిమా అమ్మడి కెరీర్ ని మలుపు తిప్పుతుంది అనుకున్నారు. కానీ, అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో దివికి మళ్ళీ అవకాశాలు రాలేదు.
సినిమాల్లో అవకాశాలు రాకపోయినా ఈ చిన్నది అస్సలు నిరుత్సాహపడలేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే దివి, తన ఫిట్‌నెస్ ఫోటోలు, గ్లామరస్ ఫోటోషూట్‌లతో కుర్రకారును నిద్రలేకుండా చేస్తోంది. ప్రతిరోజు తన లైఫ్ లో జరిగే విషయాలను ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. వాటికి అద్భుతమైన క్యాప్షన్స్ పెడుతూ ఉంటుంది. తాజాగా ఈ చిన్నది జిమ్ లో చెమటలు చిందిస్తోన్న ఫోటోలను షేర్ చేసింది.
బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో నడుపు అందాలను ఎరగా వేసి.. మత్తెక్కించే ఫోజులతో కనిపించింది. ఇక ఈ ఫోటోలకు క్యాప్షన్ గా స్వర్గానికి దారి చూపిస్తా వచ్చేయి అంటూ పెద్ది సినిమాలోని సాంగ్ లైన్ ని వాడేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్స్ సైతం సూపర్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ రేంజ్ అందగత్తెకి మేకర్స్ ఛాన్స్ లు ఇస్తారేమో చూడాలి.