Venky Atluri: విశ్వనాథ్ అండ్ సన్స్.. తమిళ సినిమా! ఇక్కడ.. డబ్బింగ్ చేశాం
ABN, Publish Date - Jul 24 , 2026 | 10:43 AM
సూర్య హీరోగా తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా గురించి దర్శకుడు వెంకీ అట్లూరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లక్కీ భాస్కర్ వంటి సూపర్ సక్సెస్ చిత్రం తర్వాత వెంకీ అట్లూరీ (Venky Atluri) తెరకెక్కించిన చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons) . తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) హీరోగా నటించగా మమితా బైజు (Mamitha Baiju), రాధిక (Radhika Sarathkumar), రవీనా టాండన్ (Raveena Tandon) కీలక పాత్రల్లో నటించారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మించింది. ఇప్పటికే షూటింగ్ సైతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్, సాంగ్స్ మంచి బజ్ తీసుకు వచ్చాయి.
అయితే.. తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు వెంకీ అట్లూరి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ముందు నుంచి ఇది తెలుగు సినిమానా లేక తమిళ చిత్రమా అంటూ చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో విశ్వనాథ్ అండ్ సన్స్ స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదని ఔట్ అండ్ ఔట్ తమిళ సినిమానే అంటూ దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. తొలుత నేను ధనుష్‌తో 'వాతి (సార్)' సినిమా సమయంలో ఒక ప్రయోగం చేయాలనుకున్నామని అన్నారు. ఓటీటీ వేదికల ద్వారా ధనుష్‌కు తెలుగులో భారీ స్థాయిలో అభిమానులు పెరిగారని, అందుకే తమిళం, తెలుగురెండు భాషల్లో ఒకేసారి సినిమా తెరకెక్కించే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అయితే 'విశ్వనాథ్ అండ్ సన్స్' కథ, కథనం దృష్ట్యా ముందుగా తమిళంలో పూర్తి చేసి ఆ తర్వాత తెలుగులో డబ్ చేశామని తెలిపారు. సూర్యతో సినిమా చేయాలనేది తన చిరకాల కోరిక అని భవిష్యత్తులో ఆయనతో తప్పకుండా ఓ మంచి కథతో మరో సినిమా చేయాలని అనుకుంటున్నానని తెలిపారు.
ఇదిలాఉంటే.. విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగు సినిమా కాదు తమిళ సినిమా అని తెలియడంతో అనేక మంది తెలుగు ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారు. అంతేగాక ఇప్పటివరకు సినిమాపై ఉన్న క్రేజ్ సైతం తగ్గుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అడాప్టెట్ సన్ అంటూ తెలుగు నాట పేరు సొంతం చేసుకున్న సూర్య తెలుగు దర్శకుడితో తెలుగులో సినిమా చేయాలేక పోయాడా అంటూపలువురు విమర్శలు చేస్తున్నారు.