త్రివిక్రమ్‌కి తెలియదనుకుంటున్నా.. ఆ టైటిల్‌కు పూర్తి డబ్బు తీసుకోలేదు
ABN, Publish Date - Mar 09 , 2026 | 10:30 AM
'నరుడి బ్రతుకు నటన' సినిమా టైటిల్ వివాదంపై గతంలో త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు తల్లాడ సాయికృష్ణ వివరణ ఇచ్చారు.
'నరుడి బ్రతుకు నటన' (Narudi Bathuku Natana) సినిమా టైటిల్ వివాదంపై గతంలో త్రివిక్రమ్ (Trivikram) చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ వివరణ ఇచ్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఆ టైటిల్ కోసం నాకు ఇచ్చింది లక్ష రూపాయలు మాత్రమే. మిగిలిన డబ్బులు ఇవ్వలేదు. ఇండస్ట్రీలో అందరితో బాగా ఉండాలనే ఉద్దేశ్యంతో మిగతా డబ్బు వద్దు అనుకున్నాను. 'నరుడి బ్రతుకు నటన' టైటిల్ డబ్బులు ఇచ్చి మరీ తీసుకున్నాం' అని ఇటీవల ఓ వేదికపై త్రివిక్రమ్ అన్నారు. నేను ఆ టైటిల్ కు పూర్తిగా డబ్బులు తీసుకోలేదు అనే విషయం త్రివిక్రమ్ గారికి తెలియదు అనుకుంటున్నాను' అని తల్లాడ సాయి కృష్ణ (tallada Sai krishna) స్పష్టం చేశారు.
తాజాగా సాయికృష్ణ తల్లాడ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తోన్న చిత్రం 'చెట్టు మీద దెయ్యం నాకేం భయం'. సాయి కృష్ణ, మాధురి, బాలు, రంజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ ను ఆదివారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ 'చిన్ననాటి మాటలను గుర్తుచేసేలా 'చెట్టు మీద దెయ్యం నాకేం భయం' అనే క్యాచీ టైటిల్‌తో వస్తున్న సినిమా ఇది. హారర్ కామెడీతో ప్రేక్షకులను భయపెడుతూనే కడుపుబ్బా నవ్విస్తుంది. శబరి మ్యూజిక్ సంస్థ ఆడియో హక్కుల్ని దక్కించుకుంది. త్వరలో టీజర్, ట్రైలర్ విడుదల చేసి వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని అన్నారు.