సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రామ్ చరణ్‌తో.. సుకుమార్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్! లెక్కల మాష్టారు.. అంటే మాములుగా ఉండ‌దు మ‌రి

ABN, Publish Date - Mar 16 , 2026 | 09:14 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోయే కొత్త సినిమా గురించి చిత్ర పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ram charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కలయికలో రాబోయే కొత్త సినిమా గురించి చిత్ర పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 30న పెద్ది ( Peddi) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు విరామం తీసుకోనున్న చరణ్, వెంటనే సుకుమార్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో సుకుమార్ కథను పూర్తిస్థాయిలో వినిపించారని, దానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

ప్రస్తుతం సుకుమార్ తన టీమ్‌తో కలిసి ఈ కథకు తుది మెరుగులు దిద్దుతున్నారట. 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో, ఈసారి సుకుమార్ ఎలాంటి జోనర్‌ను ఎంచుకున్నారనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. గతంలో వీరు గ్రామీణ నేపథ్యంతో అలరించగా, ఈ సారి అర్బన్ కథాంశంతో వస్తే బాగుంటుందని సినీ ప్రియులు, అభిమానులు ఆశిస్తున్నారు. అయితే సుకుమార్ ఆలోచనా విధానం మాత్రం భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన కేవలం జోనర్ కంటే కూడా రామ్ చరణ్ పాత్రను డిజైన్ చేసే విధానంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని తెలుస్తోంది.

సుకుమార్ గత చిత్రాలను గమనిస్తే, ఆయన కథలన్నీ పాత్రల చుట్టూనే తిరుగుతుంటాయి. ఆయన తొలి సినిమా 'ఆర్య' నుంచి మొన్నటి 'పుష్ప' వరకు క్యారెక్టరైజేషన్ అనేది చాలా బలంగా ఉంటుంది. కథ కంటే కూడా ఆ పాత్ర చేసే ప్రయాణమే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ కోసం కూడా సుకుమార్ ఒక సరికొత్త మేనరిజంతో కూడిన పాత్రను సిద్ధం చేశారట. ఈ సినిమాలో చరణ్ పాత్ర చిత్రణ ఎంతో మెస్మరైజింగ్‌గా ఉండబోతోందని, గతంలో ఆయన పోషించని విభిన్నమైన షేడ్స్ ఇందులో ఉంటాయని ఇండస్ట్రీ టాక్.

ఈ పాత్రపై ఉన్న నమ్మకంతోనే చరణ్ వెంటనే ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పారట. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం 'పెద్ది' సినిమా విడుదలైన తర్వాతే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. సుకుమార్ మార్క్ టేకింగ్, చరణ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అలాగే ఈ చిత్రంలోని కొత్తదనం మెగా అభిమానులకు పెద్ద విందుగా మారబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - Mar 16 , 2026 | 09:14 PM