ఆగిన.. నాని బ్లడీ రోమియో? ఓజీ2.. పనుల్లో సుజిత్ బిజీ
ABN, Publish Date - May 08 , 2026 | 09:42 AM
నాని బ్లడీ రోమియోను పక్కన పెట్టి.. OG 2 పనుల్లో సుజిత్ బిజీ అయిపోయాడన్న వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.
టాలీవుడ్‌లో స్టైలిష్ అండ్ గన్ షాట్ మేకింగ్‌కు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే.. టక్కున వినిపించే పేరు దర్శకుడు సుజిత్ (Sujith). రన్ రాజా రన్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, సాహో తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుని, OG తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. నాని (Nani)తో చేయాల్సిన బ్లడీ రోమియో (Bloody Romeo)ను పక్కన పెట్టి.. OG 2 పనుల్లో సుజిత్ బిజీ అయిపోయాడన్న వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. అసలు దీని వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటి..?
నిజానికి సుజిత్ తన తదుపరి చిత్రాన్ని నేచురల్ స్టార్ నానితో బ్లడీ రోమియో పేరుతో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం నాని నటిస్తున్న ప్రస్తుత చిత్రం ది ప్యారడైజ్. దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో నాని ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. తొలుత మార్చిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం, ఆగస్టు 21కి వాయిదా పడింది.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. అవుట్‌పుట్ మరింత పక్కాగా రావడం కోసం ఈ సినిమా మరికొంత కాలం వాయిదా పడే అవకాశం ఉంది. హీరో నాని డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో, సుజిత్ తన సమయాన్ని వృథా చేయదలచుకోలేదు. నాని సెట్స్‌పైకి రావడానికి కనీసం మరో 6 నెలల సమయం పట్టేలా ఉండడంతో, సుజిత్ తన ఫోకస్‌ను OG 2 వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. OG పార్ట్ 1 మేకింగ్ సమయంలోనే పవన్ కళ్యాణ్ అండ్ సుజిత్ మధ్య ఒక మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ మూవీపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, పార్ట్ 2 కి సంబంధించిన స్క్రిప్ట్ పనులను సుజిత్ వేగవంతం చేశారు.
ఒకటి మాత్రం నిజం.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో OG క్రియేట్ చేసిన ట్రెండ్ మామూలుది కాదు. ఒక్క తెలుగులోనే 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డ్స్ సృష్టించి పవన్ స్టామినా ఏంటో నిరూపించింది. ఈ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సుజిత్ కూడా ఈ గ్యాప్‌లో సీక్వెల్ కథను పక్కాగా లాక్ చేసి, నాని సినిమా మొదలయ్యే లోపే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇది పవర్ స్టార్ అభిమానులకు నిజంగా ఒక ఊహించని సర్‌ప్రైజ్ అని చెప్పవచ్చు. సో.. సుజిత్ ఇప్పుడు డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడన్నమాట. ఒకవైపు నాని కోసం బ్లడీ రోమియో స్క్రిప్ట్‌ను సిద్ధంగా ఉంచుతూనే, మరోవైపు పవన్ కళ్యాణ్ కోసం OG 2 ప్రపంచాన్ని రెడీ చేస్తున్నాడు. నాని రాగానే బ్లడీ రోమియో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఇటు పవన్ ఫ్యాన్స్‌ను, అటు నాని ఫ్యాన్స్‌ను ఇద్దర్నీ సాటిస్ఫై చేసే పనిలో సుజిత్ బిజీగా ఉన్నారు.