సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ఇస్తున్న జక్కన్న! హైప్‌ అస్సలు.. తగ్గనివ్వటం లేదుగా

ABN, Publish Date - Mar 26 , 2026 | 06:11 PM

సినిమా అంటే ఒక బాక్సాఫీస్ నంబర్ కాదు, ఒక ఎమోషన్, ఒక ఎక్స్‌పీరియన్స్ అని నిరూపించిన పేరు.. ఎస్.ఎస్. రాజమౌళి

rajamouli

సినిమా అంటే ఒక బాక్సాఫీస్ నంబర్ కాదు, ఒక ఎమోషన్, ఒక ఎక్స్‌పీరియన్స్ అని నిరూపించిన పేరు.. ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli). ఇక టాలీవుడ్ ప్రిన్స్, గ్లోబల్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో జక్కన్న చేతులు కలిపితే.. ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ వారణాసి (Varanasi). ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండే అంచనాలు ఆకాశాన్ని తాకగా ఇప్ప‌టికే షూటింగ్ 70 శాతం పూర్తైంది. అయితే.. ఈ ప్రాజెక్ట్ గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది అమాంతం వైరల్ అవుతోంది.ఈ నేప‌థ్యంలో ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన ఒక అప్‌డేట్ ఆ అంచనాలను పాతాళంలోకి నెట్టేసి, కొత్త హిమాలయ శిఖరాలను తాకుతోంది!

సినిమా మేకింగ్‌లో జక్కన్న స్టైలే వేరు.. సినిమాకు హైప్ పెంచడంలో ఆయన ఒక మాస్టర్. గతేడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక భారీ ఈవెంట్ ద్వారా ఈ సినిమా గురించి చిన్న క్లూ ఇచ్చి, గ్లోబల్ వైడ్‌గా అంచనాలు పెంచేశారు. కేవలం ఒక ప్రీ-గ్లింప్స్‌తో సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో శాంపిల్ చూపించారు. ఇక సినిమా గురించి జనం కొంచెం మర్చిపోతున్నారనుకున్న ప్రతిసారీ.. ఒక కొత్త ట్విస్ట్ ఇవ్వడం జక్కన్నకు అలవాటు. రెండు భాగాలుగా వస్తుందని అందరూ భావిస్తే, "సింగిల్ పార్ట్, పక్కా టైట్ స్క్రీన్‌ప్లే" అని చెప్పి షాక్ ఇచ్చారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్, రిలీజ్ డేట్.. ఇలా ప్రతి అప్‌డేట్ ఒక ట్రెండ్ సెట్టర్. తాజాగా ఈ 'వారణాసి' సినిమాకు సంబంధించిన సెట్స్, మేకింగ్ ఫొటోలను చిత్రబృందం విడుదల చేయ‌గా క్ష‌ణాల్లో వైర‌ల్ అయ్యాయి. అందరి దృష్టిని ఆకర్షించి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

'మగధీర', 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాల ద్వారా త‌న‌ విజన్ ఎలాంటిదో ప్రేక్షకులకు తెలియజేశారు ద‌ర్శ‌క దిగ్గ‌జ్ రాజ‌మౌళి. ముఖ్యంగా బాహుబలిలో మాహిష్మ‌తి సామ్రాజ్యాన్ని తెరపై ఆయన చూపించిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు వార‌ణాసి సినిమా కోసం అంత‌కుమించి అనే రేంజ్‌లో ఓ స‌రికొత్త ప్ర‌పంచాన్ని పునః సృష్టించారు. ఈ ఫోటోలు చూస్తే.. మూవీని ఏ రేంజ్‌లో తయారు చేయబోతున్నారో అర్ధమవుతుంది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో వారణాసి నగరాన్ని దించేశాడు దర్శక దిగ్గజం. ఈ సెట్స్‌ చూస్తుంటే మనం వారణాసిలో ఉన్నామా లేక మరోచోట ఉన్నామా అనే అనుమానం రాకమానదు.

'వారణాసి' సినిమా పురాతన కాశీ పట్టణం నేపథ్యంలో సాగుతుండడంతో ఈ నగరం సెట్స్ ను అందరూ ఆశ్చర్యపోయేలా అద్భుతంగా తయారు చేయిస్తున్నారు రాజ మౌళి. దాదాపు 350 మంది అహర్నిశలూ కష్టపడి నిర్మించిన ఇది నిజమైన కాశీ నగరాన్ని తలపిస్తోంది. రెండు లక్షల ఎనబై వేల అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో ఈ న‌గ‌రం సెట్‌ను నిర్మించారు. ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో త్రేతాయుగం నుంచి ప్రస్తుత కాలం వరకూ జరగనుంది. కాలక్రమేణా ఈ పట్టణం ఎలా పరిణామం చెందుతుందో ఆ విధంగా సెట్ డిజైన్‌లో మార్పులు చేస్తున్నారు. అందుకు తగ్గట్లే వారణాసిలోని ప్రతీ వీధిని, కట్టడాన్ని తలపించేలా ముస్తాబు చేస్తున్నారు. అందుకోసం ఎన్నో రిఫరెన్సులు, జాగ్రత్తలు తీసుకుంది టీమ్.. 'వారణాసి'లోని కాశీ సెట్‌లో రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం. హైలైట్‌గా నిలవనుంది. ఈ ఆలయ కట్టడం ఎలా వంపు తిరిగి ఉందో. సినిమాలోనూ అలానే కనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. అదే కోణంలో, అంతే ఎత్తులో ఉండేలా తయారుచేస్తున్నారు. అలంకరణ, శిల్పకళ. ఇలా ఏ చిన్న డీటైల్ కూడా మిస్ కాకుండా చూస్తున్నారు.

ఆ ఇరుకైన గల్లీలు, గంగా తీరపు ఆధ్యాత్మికత, అక్కడి పురాతన కట్టడాల నిర్మాణం.. ప్రతి చిన్న డీటెయిలింగ్‌ను ఎంత అద్భుతంగా రీక్రియేట్ చేశారో తాజాగా విడుద‌ల చేసిన‌ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. రాజమౌళి గారు తన సినిమాల్లో గ్రాండియర్, డీటెయిలింగ్ ఎంత ఇంపార్టెంటో మరోసారి నిరూపించారు. ఈ మేకింగ్ ఫోటోలు, వీడియోలతో ఈ వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో ఎలాంటి కథ ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. రాజమౌళి సినిమాలు అంటే ఏళ్ల తరబడి షూటింగ్ జరుగుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఈసారి జక్కన్న స్పీడ్ పెంచారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే 70 శాతం పైగా పూర్తయింది. ఈ వేగం చూస్తుంటే సినిమా అనుకున్న సమయానికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

దాదాపు రూ.1900 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రుద్ర పాత్రలో మహేశ్ బాబు కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకోవడంతో పాటూ యుద్ధ కళల్లోనూ ప్ర‌త్యేక‌ శిక్షణ తీసుకున్నారు ఆయన. పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో, ప్రియాంక చోప్రా మందాకినిగా కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్ 7న ఈ విజువల్ వండర్‌ను వెండితెరపైకి తీసుకురావడానికి చిత్ర యూనిట్ శరవేగంగా పనిచేస్తోంది.వారణాసి మేకింగ్ ఫోటోస్ చూశాక, మహేష్ బాబు గ్లోబల్ మేకోవర్, రాజమౌళి విజన్.. ఈ కాంబినేషన్ మరోసారి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోంది. అభిమానులు మరియు సినీ ప్రేమికుల అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు.

Updated Date - Mar 26 , 2026 | 06:11 PM