సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దర్శకుడు శ్రీను వైట్ల కూతురిని చూశారా.. హాలీవుడ్ మోడల్‌కు ఏమాత్రం తీసిపోదు

ABN, Publish Date - Sep 21 , 2026 | 08:10 PM

టాలీవుడ్‌లో సరికొత్త కామెడీ ట్రెండ్‌ను పరిచయం చేసి, వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల

Aanandi vaitla

టాలీవుడ్‌లో సరికొత్త కామెడీ ట్రెండ్‌ను పరిచయం చేసి, వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల (Srinu Vaitla). నీకోసం చిత్రంతో దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించిన ఆయన.. 'ఆనందం', 'వెంకీ', 'ఢీ', 'రెడీ', 'దూకుడు', 'బాద్ షా' వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. వినోదానికి ప్రాధాన్యమిస్తూ ఆయన తీసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అయితే ఆ తర్వాత వచ్చిన 'ఆగడు', 'బ్రూస్ లీ', 'మిస్టర్', 'అమర్ అక్బర్ ఆంటోనీ', 'విశ్వం' వంటి సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఆయన కొంతకాలం ఇండస్ట్రీకి, అలాగే సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం శ్రీను వైట్ల.. శర్వానంద్ తో కలిసి జార్జ్ క్రిష్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.


ఇక శ్రీను వైట్ల సినిమాల విషయం పక్కన పెడితే.. ఆయన కుమార్తె ఆనంది వైట్ల సోషల్ మీడియా వేదికగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటూ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నిత్యం తన లేటెస్ట్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్లతో, డిఫరెంట్ ఫోటోషూట్లతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకునే ఈ భామ, తాజాగా పోస్ట్ చేసిన బోల్డ్ అండ్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ సీత్రూ షీర్ డ్రెస్‌లో అత్యంత గ్లామరస్‌గా కనిపించి నెటిజన్లకు ఫ్యూజులు అవుట్ చేసింది. తన పర్‌ఫెక్ట్ ఫిజిక్, మోడ్రన్ ఫ్యాషన్ సెన్స్‌తో గ్లామర్ హద్దులు చెరిపేస్తూ ఆమె ఇచ్చిన పోజులు కుర్రకారు మనసు దోచుకుంటున్నాయి. ఈ పోస్ట్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంటర్నేషనల్ పాప్ మ్యూజిక్ యాడ్ చేసి తన స్టైలిష్ వైబ్‌ను మరింత ఎలివేట్ చేసింది.


ఇక ఆనంది లేటెస్ట్ ఫోటోస్ చూసిన నెటిజన్లు హాలీవుడ్ మోడల్ రేంజ్ లుక్, అల్ట్రా మోడ్రన్ బ్యూటీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తండ్రి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా పేరొందిన నేపథ్యంలో, ఈ రేంజ్ గ్లామర్ లుక్స్‌తో మెరిసిపోతున్న ఆనంది వైట్ల త్వరలోనే హీరోయిన్‌గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరి కూతురిని వైట్ల ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడా.. లేదా అనేది చూడాలి.

Updated Date - Sep 21 , 2026 | 08:14 PM