ప్యారడైజ్ ఎఫెక్ట్.. రూటు మార్చిన శ్రీకాంత్ ఓదెల
ABN, Publish Date - Oct 28 , 2026 | 09:28 PM
సాధారణంగా ఒక డైరెక్టర్ ఒక జానర్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొడితే .. ఆ తరువాత అతడి నుంచి వచ్చే ప్రతి సినిమా ఆ జానర్ లోనే ఉంటుంది అని ప్రేక్షకులు నమ్ముతారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం డైరెక్టర్లు మొదటి సినిమా కంటే ఇంకా ఎక్కువ రావాలని లేనిపోని సీన్స్, యాక్షన్ యాడ్ చేసి.. చేతులు కాల్చుకుంటున్నారు.
సాధారణంగా ఒక డైరెక్టర్ ఒక జానర్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొడితే .. ఆ తరువాత అతడి నుంచి వచ్చే ప్రతి సినిమా ఆ జానర్ లోనే ఉంటుంది అని ప్రేక్షకులు నమ్ముతారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం డైరెక్టర్లు మొదటి సినిమా కంటే ఇంకా ఎక్కువ రావాలని లేనిపోని సీన్స్, యాక్షన్ యాడ్ చేసి.. చేతులు కాల్చుకుంటున్నారు. అలా చేతులు కాల్చుకున్న దర్శకులలో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కూడా ఉన్నాడు. దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల సరికొత్త ట్రెండ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. నానిలో ఊర మాస్ హీరోని బయటకు తీసుకొచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక దసరా హిట్ అయ్యింది కదా అని అదే రా అండ్ రస్టిక్ గా నానితోనే ది ప్యారడైజ్ ని తెరకెక్కించాడు. దసరా కన్నా ఎక్కువ మాస్ ఎలిమెంట్స్ ఉండాలి అనుకున్నాడో ఏమో కానీ రక్తపాతం తప్ప లోపాలను సరిచూసుకోలేదు. దీంతో ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ గా మారింది. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ ఏమో కానీ, శ్రీకాంత్ ఓదెల రూటు మార్చాడు. ఈ యాక్షన్, రక్తపాతాన్ని వదిలి లవ్ స్టోరీ మీద పడ్డాడట. తాజా సమాచారం ప్రకారం, శ్రీకాంత్ ఓదెల తన తదుపరి చిత్రాన్ని ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నాడట. ముఖ్యంగా ఈ కథను పూర్తిగా తెలంగాణ ఉద్యమం బ్యాక్‌డ్రాప్‌లో నడిచే పీరియాడిక్ లవ్ డ్రామాగా సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ ఉద్యమ కాలం నాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల నడుమ సాగే ఒక స్వచ్ఛమైన ప్రేమకథగా ఈ చిత్రం ఉండనుందని టాక్. దసరా సినిమాలో సింగరేణి బొగ్గు గనుల నేపధ్యం, పల్లెటూరి వాతావరణాన్ని ఎంత సహజంగా చూపించాడో, ఇప్పుడు 2014 తెలంగాణ ఉద్యమ ఉత్కంఠ వాతావరణాన్ని కూడా శ్రీకాంత్ ఓదెల అదే ఇంటెన్సిటీతో తెరపైకి తీసుకురాబోతున్నాడని తెలుస్తోంది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన భావోద్వేగాలు ఉండే ఈ కాన్సెప్ట్ సినిమాపై ఇప్పుడే టాలీవుడ్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారత. మరి శ్రీకాంత్ ఓదెల ప్రేమ కథ ఎలా ఉండబోతుందో చూడాలి.