ఇరుముడి డైరెక్టర్ తో బాలయ్య.. కాంబో అదిరిందయ్యా

ABN , Publish Date - Oct 28 , 2026 | 08:54 PM

టాలీవుడ్‌లో వరుస లవ్‌స్టోరీలు, ఎమోషనల్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana). ఈమధ్యే ఇరుముడి సినిమాతో బ్లాక్ బ్లస్టర్ హిట్ అందుకున్నాడు.

Nandamuri Balakrishna

టాలీవుడ్‌లో వరుస లవ్‌స్టోరీలు, ఎమోషనల్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana). ఈమధ్యే ఇరుముడి సినిమాతో బ్లాక్ బ్లస్టర్ హిట్ అందుకున్నాడు. వరుస ప్లాప్ లతో ఉన్న మాస్ మహారాజా రవితేజకి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ని అందంచాడు. ఇక ఈ సినిమా తరువాత శివ నిర్వాణ ఎవరితో సినిమా చేస్తాడా..? అని అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ యంగ్ డైరెక్టర్, ఇప్పుడు ఏకంగా నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) తో సినిమా చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.


ప్రస్తుతం దాదా షూటింగ్ బిజీలో ఉన్న బాలకృష్ణను శివ నిర్వాణ కలిసి ఒక పవర్‌ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ స్టోరీ లైన్ ని వినిపించినట్లు తెలుస్తోంది. ఈ లైన్ బాలయ్యకు బాగా నచ్చడంతో, త్వరలోనే పూర్తి స్క్రిప్ట్‌తో వచ్చి ఫుల్ నెరేషన్ ఇవ్వాల్సిందిగా ఆయన దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ స్టోరీ కనుక నచ్చితే బాలయ్యతో శివ నిర్వాణ కన్ఫర్మ్ అయినట్టే.


ఇప్పటివరకు విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, నాని వంటి యువ హీరోలతో కెరీర్ ని మొదలుపెట్టిన శివ నిర్వాణ.. ఇక నెమ్మదిగా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఇరుముడితో రవితేజ.. ఇప్పుడు ఏకంగా హీరో బాలయ్యతో సినిమా చేయడం నిజంగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనే చెప్పాలి. ఇది కూడా హిట్ అయితే.. తరువాత నాగార్జున, వెంకటేష్, చిరంజీవి అంటూ సీనియర్ హీరోలని కూడా కవర్ చేస్తాడేమో. ఇక బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌కు, శివ నిర్వాణ రాసే ఎమోషనల్ డైలాగ్స్ తోడైతే అదిరిపోతుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ అధికారికంగా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Updated Date - Oct 28 , 2026 | 08:58 PM