రియల్ హీరోస్.. తుఫాను బాధితులకి టాలీవుడ్ బిగ్ సపోర్ట్
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:35 PM
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాలను అర్నాబ్ తుఫాను తీవ్రంగా చుట్టుముట్టి ఆస్తి, ప్రాణ నష్టాలను మిగిల్చింది. తుఫాను ప్రభావంతో ఇళ్లు కోల్పోయి, కనీసం తాగడానికి నీరు, తినడానికి తిండి లేక నిరాశ్రయులై ప్రజలందరూ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాలను అర్నాబ్ తుఫాను తీవ్రంగా చుట్టుముట్టి ఆస్తి, ప్రాణ నష్టాలను మిగిల్చింది. తుఫాను ప్రభావంతో ఇళ్లు కోల్పోయి, కనీసం తాగడానికి నీరు, తినడానికి తిండి లేక నిరాశ్రయులై ప్రజలందరూ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాలతో నవ్వించడమే కాదు.. కష్టసమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా 'హిట్' ఫ్రాంచైజీ దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) స్వయంగా క్షేత్రస్థాయిలోకి దిగి బాధితులకు అండగా నిలబడ్డాడు. కాకినాడలో నేరుగా పర్యటిస్తూ బాధితులకు నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, సహాయ సామగ్రిని అందిస్తూ ఆయన తన ఉదారతను చాటుకున్నాడు.
రెండు రోజుల క్రితం ఈ ఆపత్కాలంలో సహాయం అందించాలంటూ శైలేష్ కొలను ఇచ్చిన పిలుపు సోషల్ మీడియాలో ఒక సామూహిక విప్లవంగా మారింది. ఆయన పిలుపుకు స్పందించి వందలాది మంది యువకులు, స్థానికులు మరియు దాతృత్వ హృదయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్షేత్రస్థాయి సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు. శైలేష్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా భారీగా అండగా నిలిచారు.
ఈ రిలీఫ్ ఫండ్‌కు ఆర్థికంగా, మానసికంగా వెన్నుదన్నుగా నిలిచిన నేచురల్ స్టార్ నాని, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్, హీరోయిన్ శ్రీనిధి శెట్టిలతో పాటు ఎస్కే గోల్డెన్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థకు శైలేష్ కొలను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు. తెరపై రీల్ హీరోలను చూపించే శైలేష్, నిజ జీవితంలో కాకినాడ బాధితుల పాలిట రియల్ హీరోగా నిలిచారంటూ నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన ఈ సేవా బృందానికి, దాతలకు సినీ లోకం జేజేలు పలుకుతోంది.
ఇక శైలేష్ కొలను ప్రస్తుతం ఏమో ఏమో ఇది అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. రోషన్ మేక, ప్రీతి ముకుందన్ జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 30 నే రిలీజ్ కావల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన ఈ చిత్రం వాయిదా పడింది. ఇక ఈ చిత్రం కాకుండా హిట్ 4 ని శైలేష్ కొలను మొదలుపెట్టనున్నాడు. ఏదిఏమైనాతన సినిమాల్లో క్రైమ్ ని అత్యంత ఘోరంగా చూపించే ఈ డైరెక్టర్ మనసు రియల్ లైఫ్ ఎంత సున్నితమో ఈ ఘటన ద్వారా తెలుస్తోందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.
Also Read :
Radhika Apte: లెజెండ్.. ఆ సినిమా చూస్తేనే అసహ్యం వేస్తుంది
‘రామాయణ’.. ఐమ్యాక్స్ ట్రైలర్ చూసేయండి..
దివి పాప.. పిచ్చెక్కిస్తుందిగా