సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

టాలీవుడ్ డైరెక్టర్‌తో హృతిక్ రోషన్.. బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే

ABN, Publish Date - Jul 04 , 2026 | 05:59 PM

గీత గోవిందం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు పరశురామ్ పెట్ల(Parusuram Petla). ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా మారతాడు అనుకున్నారు.

Parasuram Petla

గీత గోవిందం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు పరశురామ్ పెట్ల(Parusuram Petla). ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా మారతాడు అనుకున్నారు. కానీ, ఆ సినిమా రిలీజ్ అయిన నాలుగేళ్ల తరువాత సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇక రెండేళ్ల క్రితం విజయ్ దేవరకొండతోనే ది ఫ్యామిలీ స్టార్ అంటూ వచ్చాడు. ఇక ఈ సినిమా కూడా పరుశురామ్ కి కలిసి రాలేదు. దీంతో రెండేళ్ళు గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు బాలీవుడ్‌లోకి భారీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక క్రేజీ వార్త హల్‌చల్ చేస్తోంది.


బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌తో పరశురామ్ పెట్ల ఒక భారీ పాన్-ఇండియా సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పరశురామ్ చెప్పిన ఒక యూనివర్సల్ ఎమోషనల్ లైన్ హృతిక్‌కు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ వైపు అడుగులు పడుతున్నాయట. ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేయడానికి స్టార్ ప్రొడక్షన్ హౌస్ రంగంలోకి దిగడం విశేషం. కేజీఎఫ్, సలార్, కాంతార వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లు సమాచారం. హోంబాలే ఫిల్మ్స్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ మధ్యనే సూర్యతో సినిమాను అధికారికంగా ప్రకటించిన హోంబాలే త్వరలోనే పరుశురామ్ - హృతిక్ మూవీని కూడా ప్రకటించనుందట.


ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. హృతిక్ రోషన్ తన మునుపటి కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండగా, పరశురామ్ కూడా స్క్రిప్ట్‌కు పక్కాగా ఫైనల్ టచెస్ ఇచ్చే పనిలో ఉన్నారట. అంతా అనుకున్నట్లు జరిగితే, పరశురామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలవనుందని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Updated Date - Jul 04 , 2026 | 06:15 PM