Kishore Tirumala: ఆ ప్రశ్నకు.. ప్రేక్షకులు షాక్‌ అవుతారు

ABN , Publish Date - Jan 13 , 2026 | 07:31 AM

రవితేజ కథానాయకుడిగా కిశోర్‌ తిరుమల తెరకెక్కించిన హాస్య భరిత కుటుంబ కథా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ .

RaviTeja

మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) కథానాయకుడిగా కిశోర్‌ తిరుమల తెరకెక్కించిన హాస్య భరిత కుటుంబ కథా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). డింపుల్‌ హయతి ( Dimple Hayathi), ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) కథానాయికలు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు.

సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా డైరెక్టర్‌ కిశోర్‌ తిరుమల మీడియాతో మాట్లాడుతూ ‘ఒక భర్త తన అనుభవంతో మిగతా భర్తలకు ఎం చెబుతాడు? తను ఎదుర్కొన్న స్ట్రగుల్స్‌ ఏమిటి? అనేవి కథలోని ప్రధానాంశాలు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు అడిగిన ప్రశ్నకు సమాధానం చాట్‌ జీపీటీలో కూడా దొరకదు. కానీ ఈ సినిమాలో సమాధానం దొరుకుంది.

థియేటర్‌లో ఈ ప్రశ్న విన్న ప్రేక్షకులు కచ్చితంగా షాక్‌ అవుతారు. ఆ ప్రశ్నలోనే అన్నింటికంటే పెద్ద పనిష్మెంట్‌ ఉంటుంది. ఆ సన్నివేశాన్ని స్ర్కీన్‌పై చూస్తేనే మజా వస్తుంది. తెరపై రవితేజ గారు చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారు. ఆషికా, డింపుల్‌ ఇద్దరివీ ప్రాధాన్యమున్న పాత్రలే. వెన్నెల కిశోర్‌, సునీల్‌ క్యారెక్టర్లు ఆద్యంతం నవ్విస్తాయి. సత్య నటించిన ఓ చిన్న పాటకు కొరియోగ్రఫీ కూడా చేశాను. ఈ సాంగ్‌ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది’ అని తెలిపారు.

Updated Date - Jan 13 , 2026 | 07:59 AM