అల్లు అర్జున్ సినిమా మిస్ చేసుకున్న బ్లాస్ట్ బ్యూటీ.. ఉండి ఉంటేనా

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:08 PM

ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవేటెడ్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం రాకా (Raaka). ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు.

Raaka

ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవేటెడ్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం రాకా (Raaka). ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాకి సంబంధించి ఒక కీలక న్యూస్ ని అట్లీ అభిమనులతో పంచుకున్నాడు. బ్లాస్ట్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ప్రీతి ముకుందన్ రాకాలో ఛాన్స్ మిస్ చేసుకుందని తెలిపి షాక్ ఇచ్చాడు.


తాజాగా ఇదయమ్ మురళీ సినిమా ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన దర్శకుడు అట్లీ రాకా సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ కోసం తాను స్వయంగా ప్రీతి ముకుందన్‌ను అప్రోచ్ అయ్యానని తెలిపాడు. బ్లాస్ట్ సినిమాలో ఆమె అందం, యాక్షన్ సీక్వెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి ఈ ఆఫర్ ఇచ్చానని, అయితే ఆమెకు ఉన్న బిజీ డేట్స్, టైట్ షెడ్యూల్స్ వల్ల ఈ మెగా ప్రాజెక్ట్‌ను లైట్ తీసుకుందని అట్లీ తెలిపాడు. దీంతో ఆమె చేయాల్సిన ఆ పవర్‌ఫుల్ రోల్‌లోకి మలయాళ బ్యూటీ ఫెమినా జార్జ్ ఎంట్రీ ఇచ్చినట్లు అట్లీ స్పష్టం చేశాడు. ఇక ఈ విషయం తెలియడంతో బన్నీ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి మంచి ఛాన్స్ మిస్ చేసుకుందని, ఆమె కూడా రాకాలో చేరి ఉంటే సినిమా మరో లెవెల్ కి వెళ్ళేదని చెప్పుకొస్తున్నారు.


అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు. కానీ, ప్రీతి తప్పక ఈ ఛాన్స్ వదులుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. బ్లాస్ట్ తరువాత ప్రీతికి వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. మరి ఈ సినిమా ఛాన్స్ పోయినా.. భవిష్యత్ లో అల్లు అర్జున్ సరసన ఈ చిన్నది కనిపిస్తుందేమో చూడాలి.

Updated Date - Jul 08 , 2026 | 12:09 PM