Anil Ravipudi: పదో సినిమాకి.. లైన్ దొరికేసింది! అనౌన్స్ మెంట్ నుంచే.. రచ్చ స్టార్ట్
ABN, Publish Date - Jan 23 , 2026 | 09:32 AM
ఇటీవలే.. 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందించిన అనిల్ రావిపూడి తన రాబోయే సినిమా గురించి హింట్ ఇచ్చాడు.
'నా పదో సినిమాకి.. ఐడియా వచ్చేసింది. ఈసారి టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే ఒక విచిత్రమైన జర్నీ ప్రారంభం కాబోతుంది. ఈ ఏడాది జూన్, జూలై నాటికి సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. సంకాంత్రికే వస్తుంది' అని తన తదుపరి ప్రాజెక్టు గురించి వివరించారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi).
చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara) జంటగా ఆయన రూపొందించిన 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Varaprasad Garu) సినిమా ఈ సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. చిరంజీవి గారితో కచ్చితంగా సినిమా చేయాలనే పట్టుదలతో 'మన శంకరవరప్రసాద్ గారు' కథని సిద్ధం చేశాను. చిరంజీవి గారిని నాకు నచ్చినట్లు చూపించాలనే తపనో ఏమో కానీ, కథను చాలా సులువుగా రాసేశాను.
మేము అనుకున్నవన్నీ చక్కగా కుదిరాయి. నా కెరీర్‌లో చాలా వేగంగా పూర్తి చేసిన స్క్రిప్ట్ ఇది. 'సంక్రాంతికి వస్తున్నాం', భగవంత్ కేసరి' చిత్రాలను రీమేక్ చేసే అవకాశం వచ్చినా చేయలేదు. వెంటనే కాదు గానీ.. భవిష్యత్తులో చిరంజీవిగారితో మరో సినిమా తప్పుకుండా చేస్తా' అని అన్నారు.