సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dimple Hayathi: నాకింకా పెళ్లి కాలేదు.. డింపుల్ హయతి కామెంట్ వైరల్!

ABN, Publish Date - Nov 23 , 2026 | 05:00 PM

డింపుల్ హయతి పెళ్లిపై మరోసారి చర్చ మొదలైంది. నాకింకా పెళ్లి కాలేదు అంటూ నెటిజన్ కామెంట్‌కు ఆమె ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది.

Dimple Hayathi

సినీ తారల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆసక్తికర చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా హీరోయిన్ డింపుల్ హయతి (Dimple Hayathi) చేసిన ఓ కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘భోగి’ (Bhogi) సినిమా ఈవెంట్‌లో మందారం రంగు చీరలో సందడి చేసిన ఈ భామ.. హీరో శర్వానంద్‌తో కలిసి సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఓ ఫొటోలో డింపుల్ హయతి.. శర్వానంద్ భుజంపై తలపెట్టి రిలాక్స్ అవుతున్నట్లుగా కనిపించారు. ఈ ఫొటోను చూసిన ఓ నెటిజన్.. ‘డింపుల్‌కు పెళ్లయిపోయిందిగా’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన ఆమె.. ‘నాకింకా పెళ్లి కాలేదు’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఆమె సమాధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అసలు పెళ్లి ఎప్పుడు జరిగింది?

డింపుల్ హయతికి గతంలోనే పెళ్లయిందనే ప్రచారం ఉంది. 2023లో జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసం వద్ద ఓ ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టిన ఘటన అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఆ సమయంలో ఆమెతో పాటు ఉన్న విక్టర్ డేవిడ్‌ను డింపుల్ భర్తగా కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి. అలాగే 2025లో తన ఇంట్లో పనిచేసే వ్యక్తితో జరిగిన వివాదం సందర్భంలోనూ విక్టర్ డేవిడ్ పేరు వార్తల్లో వినిపించింది. ఆ వివాదానికి సంబంధించిన ఫిర్యాదులోనూ ఆయనను డింపుల్ భర్తగా పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది.


అయితే తాజాగా ఓ నెటిజన్ కామెంట్‌కు స్పందిస్తూ తనకు ఇంకా పెళ్లి కాలేదని డింపుల్ చెప్పడంతో గతంలో వచ్చిన వార్తలపై మరోసారి చర్చ మొదలైంది. అసలు ఈ వ్యవహారంలో నిజానిజాలు ఏమిటి? గతంలో వచ్చిన వార్తలకు, ఇప్పుడు ఆమె ఇచ్చిన సమాధానానికి మధ్య ఉన్న అసలు విషయం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ నెల 27న భోగి సందడి

ఇక సినిమాల విషయానికి వస్తే.. శర్వానంద్ సరసన డింపుల్ హయతి నటించిన ‘భోగి’ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్ నిర్మించారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఈవెంట్‌లో శర్వానంద్, డింపుల్ హయతి సందడి చేయడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

Updated Date - Nov 23 , 2026 | 06:01 PM