గీతగోవిందం డైరెక్టర్ తో మెగా మేనల్లుడు..

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:49 PM

గీతగోవిందం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు పరుశురామ్ పెట్ల. ఈ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తెరకెక్కించిన ఆయన రెండేళ్ల క్రితం ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Vaishnav Tej

గీతగోవిందం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు పరుశురామ్ పెట్ల (Parusuram Petla). ఈ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తెరకెక్కించిన ఆయన రెండేళ్ల క్రితం ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా అనంతరం కొద్దిగా గ్యాప్ తీసుకున్న పరుశురామ్ మొన్నటి వరకు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని తెలియడంతో అసలు పరుశురామ్ సినిమాలు తీస్తాడా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఎట్టకేలకు మెగా మేనల్లుడుతో ఈ డైరెక్టర్ రీఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.


తాజాగా మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ కు ఈ డైరెక్టర్ ఒక పవర్‌ఫుల్ లైన్ వినిపించినట్లు సమాచారం. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్‌లో ఈ సినిమా రూపుదిద్దుకోనుండటం విశేషం. కథ విన్న వైష్ణవ్ తేజ్ నుంచి ప్రాథమికంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని టాక్.


మరోవైపు, వైష్ణవ్ తేజ్ లైన్‌అప్‌లో విఐ ఆనంద్ దర్శకత్వంలో కూడా ఒక క్రేజీ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది. అయితే ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్క్రిప్ట్ పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది, అలాగే నిర్మాత కూడా ఖరారు కావాల్సి ఉంది. ఈ క్రమంలో వి.ఐ. ఆనంద్ సినిమా కంటే ముందే పరశురామ్ - దిల్ రాజుల ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉప్పెన తర్వాత సాలిడ్ హిట్ కోసం చూస్తున్న వైష్ణవ్ తేజ్‌కు పరశురామ్ మార్క్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సరైన ఛాయిస్ అవుతుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

మండాడి సంచలన రికార్డు.. సుహాస్, సూరి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్

అభిమాని హ‌త్య కేసు.. దర్శన్‌కు మరో బిగ్ షాక్

ధనుష్ కొత్త పార్టీ.. 'తమిళగ ఎళుచ్చి కళగం'? ఈసీ వద్ద నమోదు!

Updated Date - Oct 07 , 2026 | 04:49 PM