కొత్త వాళ్ల కోసం.. ఇలాంటి బ్యానర్ మరెక్కడా లేదు
ABN, Publish Date - Feb 13 , 2026 | 06:09 AM
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 23 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 23 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించింది. ఇప్పుడు కొత్త ప్రతిభను, విభిన్నమైన కథలను ప్రోత్సహించేందుకు నిర్మాత దిల్ రాజు (Dil Raju) ‘దిల్‌రాజు డ్రీమ్స్’ ( Dilraju Dreams) అనే సరికొత్త బ్యానర్‌ను ప్రారంభించారు. తొలి చిత్రంగా యంగ్ హీరో విక్రాంత్ నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘మార్కండేయ’ తెరకెక్కుతోంది.
ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ వేడుక గురువారం జరిగింది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘దేశంలో కొత్తవాళ్ల కోసం ఇలాంటి బ్యానర్ మరెక్కడా లేదు. ఇప్పటికి మాకు 330 స్క్రిప్ట్‌లు వచ్చాయి. వాటిలో ఐదారు సినిమాలు ఈ ఏడాది వస్తాయి. సీజీ వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల ‘మార్కండేయ’ చిత్రాన్ని వచ్చే ఏడాది మహా శివరాత్రికి విడుదల చేస్తాం.
ప్రస్తుతం ‘ఎల్లమ్మ, రౌడీ జనార్థన, దేత్తడి’ సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి’ అని తెలిపారు. మార్కండేయుడి పురాణ గాథకు ఈ చిత్రం ఆధునిక రూపం అని విక్రాంత్ చెప్పారు. హీరోగా విక్రాంత్ నటన ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు సిస్‌ట్లా వీఎంకే అన్నారు.