'రాకా'నుంచి పజిల్ పోస్టర్.. ఏమై ఉంటుందో?
ABN, Publish Date - Sep 17 , 2026 | 03:46 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రాకా.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రాకా (Raaka). బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ నుంచి మేకర్స్ తాజాగా '37' అనే నంబర్‌తో పోస్టర్ విడుదల చేశారు. ఈ పజిల్ పోస్టర్‌తో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో అది ఏమై ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది.
కొందరు నెటిజన్లు హీరో మూడు పాత్రల్లో నటిస్తున్నాడని, ఏడుగురు హీరోయిన్లు ఉన్నారని హింట్ ఇచ్చారని అంటున్నారు. మరికొందరు డైరెక్టర్ అట్లీ పుట్టినరోజు సెప్టెంబర్ 21 (3x7 = 21) న ‘రాకా’ నుంచి ఏదైనా భారీ అప్‌డేట్ రాబోతోందంటూ నెటిజన్లు లెక్కలు కడుతున్నారు. అదేవిధంగా దసరా , దీపావళి పండుగల సమయంలో ఎప్పుడైనా ఈ చిత్రం టీజర్ విడుదల చేసే ఛాన్స్ ఉందని నెట్టింట వార్తలు చక్కర్లు కిడుతున్నాయి.