సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Aakasam Lo Oka Tara: దుల్క‌ర్ 'ఆకాశంలో ఒక తార‌'.. కొత్త‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

ABN, Publish Date - Jan 18 , 2026 | 07:33 PM

మలయాళ, తెలుగు స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కే కాదు, ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు.

Aakasam Lo Oka Tara

మలయాళ, తెలుగు సూపర్‌స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ (Dulquer Salmaan). తెలుగు ప్రేక్ష‌కుల‌కే కాదు, ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. వైవిధ్య‌మైన పాత్ర‌లు, సినిమాల‌తో త‌న‌దైన ముద్రవేశాడు. తెలుగులోనూ మ‌హాన‌టి, సీతారామం. ల‌క్కీ భాస్క‌ర్‌ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల్లో అద్భుత‌మైన న‌ట‌న‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెలుగునాట‌ లిఖించుకున్నాడు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న న‌టిస్తోన్న కొత్త చిత్రం ఆకాశంలో ఒక తార (Aakasam Lo Oka Tara).

ఇదిలాఉంటే.. ల‌క్కీభాస్క‌ర్ వంటి హిట్ సినిమా ఇచ్చిన ఆయ‌న మ‌రో స్ట్రెయిట్ తెలుగు సినిమా రిలీజ్ అవ్వ‌లేదు. అయితే ఇప్ప‌టికే మూడు తెలుగు సినిమాల్లో న‌టిస్తున్న దుల్క‌ర్ ఏడాదిన్న‌ర క్రితం ప్రారంభించిన ఆకాశంలో ఒక తార చిత్రం గురించి ఎట్ట‌కేల‌కు ఏడాదిన్న‌ర త‌ర్వాత ఓ అప్డేట్ ఇచ్చారు. గీతా ఆర్ట్స్ (Geetha Arts), స్వ‌ప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా (Light Box Media) సంయుక్త నిర్మాణంలో ప‌వ‌న్ సాధినేని (pavan Sadineni) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జీవీ ప్ర‌కాశ్ సంగీతంలో ఇప్ప‌టికే రిలీజ్ చేసిన మ్యూజిక‌ల్ గ్లింప్స్ వీడియో సినిమాపై మంచి క్యురియాసిటీని తీసుకువ‌చ్చింది.

కాగా.. ఇన్నాళ్లకు ఈ చిత్రం నుంచి హీరోయిన్ లుక్ రివీల్ చేసేందుకు మేక‌ర్స్ సిద్ద‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఆదివారం సీ హ‌ర్ ఫ‌స్ట్ గ్లిమ్మ‌ర్ అంటూ ఓ చిన్న పోస్ట‌ర్ విడుద‌ల చేసి సోమ‌వారం క‌థానాయిక‌ను ప‌రిచయం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే.. ఇప్ప‌టికే క‌థానాయిక పేరు బ‌య‌ట‌కు రావ‌డం, వెంట‌నే వైర‌ల్ అవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

అయితే.. ముద్దుగుమ్మ అచ్చ తెలుగు అమ్మాయి కాగా అమెరికాలో స్థిర ప‌డిన సాత్విక వీర‌వ‌ల్లి (Sathvika Veeravalli) దుల్క‌ర్ స‌ల్మాన్ జోడీగా సినిమాల్లోకి అడుగు పెడుతోంది. ఇప్ప‌టికే గ్రాడ్యేయేష‌న్ కూడా పూర్తి చేసిన ఈ భామ మ‌ల్టీ టాలెంటెడ్‌. అయితే.. ఈ అమ్మ‌డి విష‌యం తెలిసిన అనేక మంది శ్రీలీల లానే ఈ తెలుగందం కూడా టాప్ ప్లేస్‌లోకి రావాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

Updated Date - Jan 18 , 2026 | 08:44 PM