సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చిరు లీక్స్.. 'కాకా'లో అనస్వర పాత్ర అదే

ABN, Publish Date - Nov 17 , 2026 | 09:48 PM

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లీక్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఈవెంట్ కి వచ్చినా ఆయన సినిమాల గురించి అభిమానులకు ఏదో ఒక చిన్న లీక్ ఇచ్చి వెళ్ళడం ఆయనకు అలవాటుగా మారింది.

Kaaka

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లీక్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఈవెంట్ కి వచ్చినా ఆయన సినిమాల గురించి అభిమానులకు ఏదో ఒక చిన్న లీక్ ఇచ్చి వెళ్ళడం ఆయనకు అలవాటుగా మారింది. అందుకే చిరు లీక్స్ అనే పేరుతో ఆయనే అధికారికంగా ఏదో ఒక చిన్న హింట్ ఇవ్వడం మొదలుపెట్టారు. తాజాగా చిరు నటిస్తోన్న చిత్రాల్లో కాకా సినిమా ఒకటి. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అనస్వర రాజన్ (Anaswara Rajan) ఒక అత్యంత కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన ఇట్లు అర్జున సక్సెస్ మీట్ వేదికపై చిరంజీవి మాటల సందర్భంలో అనస్వర పాత్రకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన హింట్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.


వేదికపై అనస్వర రాజన్ గురించి మాట్లాడుతూ.. 'అనస్వర కాకాలో ఫెంటాస్టిక్‌గా నటించింది. అనస్వర.. మాట్లాడతావా..తను మాట్లాడదు.. మాట్లాడలేదు నా ఈ చిన్న బిట్ స్పీచ్‌ని మీరు ఇంటికి వెళ్లి ఆలోచించుకోండి ఏంటన్నది మీకు అర్థమవుతుంది' అంటూ చిరు లీక్ చేసేశారు. పైకి ఆమెకు మైక్‌లో మాట్లాడటానికి సిగ్గు అని కవర్ చేసినప్పటికీ, కాకా సినిమాలో అనస్వర రాజన్ మాటలు రాని యువతి పాత్రలో కనిపించబోతోందా అనే సస్పెన్స్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌లో ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాకాలో చిరు కూతురుగా అనస్వర కనిపించనుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆమె మాటలు రాని యువతిగా కూడా కనిపించనుందని లీక్ అవ్వడంతో తండ్రీకూతుళ్ల మధ్య ఎమోషనల్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది.


గతంలో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న పాత్రలో అదరగొట్టినట్లే, ఇప్పుడు కాకాలో అనస్వర రాజన్ పాత్ర కూడా సినిమాకు ఎంతో ఎమోషనల్ డెప్త్‌ను తీసుకురాబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, కేవలం తన కళ్లు, హావభావాలతోనే అనస్వర ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానున్న ఈ సినిమాలో అనస్వర పాత్ర ఏ రేంజ్‌లో సర్‌ప్రైజ్ చేస్తుందో చూడాలి.

Updated Date - Nov 17 , 2026 | 09:52 PM