ఏప్రిల్లో.. 'డైమండ్ డెకాయిట్'
ABN, Publish Date - Mar 21 , 2026 | 10:30 PM
పార్థ గోపాల్ హీరోగా నటిస్తూ సూర్య జి.యాదవ్ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం 'డైమండ్ డెకాయిట్.
పార్థ గోపాల్ హీరోగా నటిస్తూ సూర్య జి.యాదవ్ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం 'డైమండ్ డెకాయిట్. మేఘన కథానాయిక. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ చిత్రంలోని పాటలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీఎన్ ఆదిత్య విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. పెద్దపల్లి రోహిత్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. పార్థ గోపాల్ మాట్లాడుతూ 'దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఏప్రిల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం' అని తెలిపారు.
చిత్ర దర్శకుడు సూర్య జి యాదవ్ మాట్లాడుతూ 'సినిమాలోని ఐదు పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చాయి. సినిమా ప్యామిలీ ఎమోషన్, రివెంజ్ డ్రామా మేళవిం పుతో ఉంటుంది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం' అని అన్నారు.
ఇదిలాఉంటే.. ఈ చిత్ర యూనిట్ ఓ వినూత్న పోటీని ప్రకటించింది. సినిమాలోని “మరదలివే” పాటకు హుక్ స్టెప్ చేసి రీల్స్ రూపంలో పంపితే బహుమతులు అందించనున్నట్లు ప్రకటించారు. ఈ పాటకు
హుక్ స్టెప్‌తో రీల్ చేసి వాట్సాప్ నంబర్: 8074801661 కు పంపించాలని విజేతలకు మొదటి బహుమతి: ₹1,00,000, రెండవ బహుమతి: ₹50,000 అందింస్తామన్నారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఛాలెంజ్‌ను ప్రకటించినట్టు యూనిట్ తెలిపింది.