సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దురంధర్‌ 2 దెబ్బకు.. పాక్‌ సర్వర్లు క్రాష్‌!

ABN, Publish Date - May 17 , 2026 | 09:55 AM

బాక్సాఫీస్ దగ్గర ఒక ఇండియన్ సినిమా ఊచకోత కోయడం మనం చూశాం. కానీ, శత్రుదేశం సర్వర్లను సైతం క్రష్ చేయడం ఎప్పుడైనా విన్నారా? అవును.. ఇప్పుడు సరిగ్గా ఇదే నిజమైంది.

Dhurandhar

బాక్సాఫీస్ దగ్గర ఒక ఇండియన్ సినిమా ఊచకోత కోయడం మనం చూశాం. కానీ, శత్రుదేశం సర్వర్లను సైతం క్రష్ చేయడం ఎప్పుడైనా విన్నారా? అవును.. ఇప్పుడు సరిగ్గా ఇదే నిజమైంది. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ధురంధర్’ (Dhurandhar )చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా సాధించిన ఘనవిజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై నిషేధం విధించినప్పటికీ.. ఓటీటీలోకి వచ్చాక నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ పొజిషన్‌లో దూసుకుపోయింది. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ ‘ధురందర్ 2 దీ వివేంజ్‌’ (Dhurandhar The Revenge) అయితే థియేటర్ల వద్ద సరికొత్త చరిత్రను లిఖించింది. కలెక్షన్ల పరంగా సరిహద్దులను చెరిపేస్తూ, ఇప్పటివరకు ఉన్న అన్ని ఇండియన్ సినిమాల రికార్డులను బద్దలు కొట్టి, సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.

అయితే, ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. తాజాగా ఈ సినిమాను జియో హాట్‌స్టార్ (Jio Hotstar)ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇది ఇండియాలో కాకుండా, ఇతర దేశాల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏంటంటే.. ఈ దేశాల జాబితాలో పాకిస్థాన్ కూడా ఉంది! సాధారణంగా మన దేశభక్తి సినిమాల్లో పాకిస్తాన్‌ను గట్టిగానే ఏకిపారేస్తుంటారు. ‘ధురందర్’ సిరీస్‌లోనూ అదే జరిగింది. అయినప్పటికీ, పాక్ ప్రజలు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతుండటం గమనార్హం. అక్కడి జనాలు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను చూడటానికి ఏ రేంజ్‌లో ఎగబడ్డారంటే.. ఊహించని స్థాయిలో ట్రాఫిక్ పెరిగిపోయి, పాకిస్థాన్‌లోని నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు సైతం క్రాష్ అయ్యాయనే టాక్ నడుస్తోంది. శత్రుదేశంలో ఒక ఇండియన్ సినిమాకు ఈ స్థాయి క్రేజ్ రావడం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి.

ఇక మన ధురందర్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వాలని, పాకిస్థాన్‌లో భారీ బడ్జెట్‌తో మేరీ ల్యారీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. మన సినిమా క్రేజ్‌ను తగ్గించాలనే ప్లాన్‌తో వచ్చిన ఆ సినిమా.. అక్కడ అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. కనీస వసూళ్లు కూడా రాబట్టలేక బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. సొంత దేశం సినిమాను పక్కనబెట్టి, మన ధురందర్-2 కోసం అక్కడి జనాలు ఎగబడుతుండటం విశేషం. ఇక పాకిస్థాన్ సోషల్ మీడియాలో సైతం మన సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రణ్‌వీర్ సింగ్ యాక్టింగ్, ఆదిత్య ధర్ టేకింగ్ అద్భుతంగా ఉన్నాయంటూ పాక్ నెటిజన్లు సైతం పోస్టులు పెడుతున్నారు. సినిమాకు సరిహద్దులు లేవని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Updated Date - May 17 , 2026 | 10:15 AM