Couple Friendly: ధీరజ్ మొగిలినేని ద్వారా రాబోతున్న 'కపుల్ ఫ్రెండ్లీ'
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:50 PM
సంతోష్ శోభన్ (Santosh Shoban) హీరోగా నటిస్తున్న సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ' (Couple Friendly). మానస వారణాసి (Manasa Varanasi) కథానాయిక.
సంతోష్ శోభన్ (Santosh Shoban) హీరోగా నటిస్తున్న సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ' (Couple Friendly). మానస వారణాసి (Manasa Varanasi) కథానాయిక. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తోంది. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ధీరజ్ మొగిలినేని కపుల్ ఫ్రెండ్లీ సినిమాను కూడా గ్రాండ్ గా తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు.
ALSO READ: Chiranjeevi: విశ్వంభర విడుదలపై చిరు క్లారిటీ.. డేట్ ఫిక్స్
Sudev Nair: నెగటివ్ క్యారెక్టర్లకు కేరాఫ్‌గా నిలిచాడు.. మెప్పిస్తున్నాడు..
Bobby Kolli: చిరంజీవికీ నచ్చిన హీరో ఎవరో తెలుసా.. దర్శకుడి క్లారిటీ