Sudev Nair: నెగటివ్ క్యారెక్టర్లకు కేరాఫ్‌గా నిలిచాడు.. మెప్పిస్తున్నాడు..
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:00 AM
మలయాళ నటుడు సుదేవ్ నాయర్ (Sudev Nair) తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటూ ముందుకెళ్తున్నారు.
మలయాళ నటుడు సుదేవ్ నాయర్ (Sudev Nair) తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆయన పోషిస్తున్న పాత్రలు, చూపిస్తున్న విలనిజం, బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఆయన పని తీరు అందరినీ మెప్పిస్తోంది. గత ఏడాది వచ్చిన ‘ఓజీ’ (OG) చిత్రంలో సుదేవ్ నాయర్ పాత్రకు, ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) చిత్రంతో సుదేవ్ నాయర్ మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. చిరంజీవితో పాటు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో అతని పాత్ర, నటించిన తీరు తెలుగు ఆడియెన్స్‌ను అలరిస్తోంది.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాయర్ నెగటివ్ రోల్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం కలిగిన సుదేవ్ నాయర్ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ నటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. త్వరలోనే తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవదానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం యష్‌తో ‘టాక్సిక్ - ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’లో ప్రధాన పాత్రను నాయర్ పోషిస్తున్నారు. ఈ మూవీ మార్చిలో ఆడియెన్స్ ముందుకు రానుంది. దీనితో టాలీవుడ్ లో నెగటివ్ కెరెక్టర్స్ కు సుదేవ్ కేరాఫ్ కానున్నదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు