‘ఏ’ సర్టిఫికెట్ వచ్చినా.. ఇది పక్కా ఫ్యామిలీ మూవీ
ABN, Publish Date - Feb 11 , 2026 | 11:37 AM
కపుల్ ఫ్రెండ్లీ మూవీ నిర్మాత ధీరజ్ మొగిలినేని సెన్సార్ టైటిల్ వివాదంపై స్పష్టతనిచ్చారు.
‘ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. కానీ శివ జీవితంలోకి మిత్ర అడుగుపెట్టాక మొదలైన ఆ ప్రయాణం మాత్రం చాలా స్పెషల్. ఆ జర్నీలోని ఎమోషన్స్ ప్రతి ప్రేక్షకుడికీ కనెక్ట్ అవుతాయి’ అని సంతోష్ శోభన్ (Santosh Shobhan) అన్నారు. ఆయన హీరోగా, మానస వారణాసి (Manasa Varanasi) హీరోయిన్‌గా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly) చిత్రం ఈనెల 14న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni) సెన్సార్ వివాదంపై స్పష్టతనిచ్చారు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ టైటిల్ మార్చమని సెన్సార్ వారు అడిగారు. కానీ కథకు అదే ప్రాణం కాబట్టి మేము రాజీ పడలేదు. దాంతో ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చింది.
అంతే తప్ప కథలో ఎలాంటి అసభ్యత లేదు. ఇది పక్కా ఫ్యామిలీ మూవీ. ప్రతి కుర్రాడు తనను తాను సంతోష్ పాత్రలో చూసుకుంటాడు’ అని చెప్పారు. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఒక అద్భుతంలా ఉంటుంది, ట్రైలర్ చూసి అందరూ బావుందని మెచ్చుకుంటుంటే చాలా సంతోషంగా ఉందని మానస వారణాసి తెలిపారు.