సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శివాజీ: 'దండోరా’ ఇక్కడితో ఆగే సినిమా కాదు..

ABN, Publish Date - Mar 08 , 2026 | 08:39 PM

తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు (gaddar awards) 2025’లో ‘దండోరా’ సత్తా చాటుకుంది. మూడు కేటగిరీల్లో ‘దండోరా’ (Dandora) అవార్డుల్ని కొల్లగొట్టింది.

Sivaji

తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు (gaddar awards) 2025’లో ‘దండోరా’ సత్తా చాటుకుంది. మూడు కేటగిరీల్లో ‘దండోరా’ (Dandora) అవార్డుల్ని కొల్లగొట్టింది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ నిర్మాణంలో మురళీకాంత్ ‘దండోరా’ చిత్రాన్ని తెరకెక్కించారు.  శివాజీ (Shivaji) న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మణిక  చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు ముఖ్య పాత్రల్ని పోషించారు.  ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు, ఇచ్చిన గుర్తింపు సందర్భంగా ఆదివారం నాడు చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది.  

శివాజీ మాట్లాడుతూ ‘మా ‘దండోరా’ సినిమాని గుర్తించి అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. ఎన్టీఆర్ గారు వేసిన ట్వీట్‌తో తెలుగు వారందరికీ ఈ చిత్రం దగ్గరైంది. సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్‌ గారికి అవార్డు రావడం ఆనందంగా ఉంది. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన బెన్నీకి థాంక్స్. తెలుగు వాళ్ల ప్రతిభను, సత్తాను చాటే చిత్రమిది. మురళీ గారు ‘దండోరా’ కథని, మూవీని మా కోసమే తీశాడనిపిస్తుంది. నటన అంటే దైవంతో సమానం. రాధ్య అనే పాప పాత్ర లేకపోయి ఉంటే ఈ సినిమా నేను చేసే వాడిని కాదు. నవదీప్, నందు, బిందు మాధవి ఇలా అందరూ ఫైనెస్ట్ యాక్టర్స్. ఈ మూవీ ఇంకా చాలా దూరం వెళ్తుందని నమ్ముతున్నాను. ఇక్కడితో ఆగే సినిమా అయితే కాదు. మున్ముందు చాలా అవార్డులు వస్తాయని ఆశిస్తున్నాను’ అని అన్నారు.


దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ ‘మా ‘దండోరా’ సినిమాకు ఇలాంటి గుర్తింపు ఇచ్చిన జ్యూరీకి, ప్రభుత్వానికి థాంక్స్. కొత్త దర్శకుడిని అయినా టీం అంతా నన్ను నమ్మింది. మార్క్ కె రాబిన్ మా సినిమాకి ప్రాణం. ఆయన, నేను కలిసి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి సినిమాకు పని చేశాం. ఇలాంటి అవార్డులు, గుర్తింపు వచ్చిన సమయాల్లోనే మన వద్ద ఉన్న టాలెంట్ గురించి అందరికీ తెలుస్తుంది. శివాజీ గారి వల్లే ఈ చిత్రం ఈ స్థాయికి వచ్చింది. ఎక్కడా, ఏనాడూ కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఈ సినిమా చూసి ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు పర్సనల్‌గా నాకు ఫోన్ చేసి అభినందించారు. ఇలాంటి గుర్తింపు, అవార్డులు వస్తే మరింత మంచి చిత్రాల్ని, సందేశాత్మాక సినిమాల్ని తీయాలనే ప్రోత్సాహం లభిస్తుంది’ అని అన్నారు.

నిర్మాత ర‌వీంద్ర బెన‌ర్జీ మాట్లాడుతూ 'మా సినిమాని గుర్తించి, అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీ మెంబర్లకి, తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.  మా ప్రయాణంలో తోడుగా నిలిచిన సాహు గారికి, నాగవంశీ గారికి థాంక్స్' అని అన్నారు.

 నటుడు నందు మాట్లాడుతూ 
'మా సినిమాకి మూడు అవార్డులు వచ్చాయి.  సినిమాకి అందరూ కలిసి సమిష్టిగా పని చేస్తేనే ఫలితం వస్తుంది. ఉత్తమ చిత్రం అనే దాంట్లో దర్శకుడు, నిర్మాత కూడా వస్తారు. ఉత్తమ నిర్మాత అనే కేటగిరీని కూడా మున్ముందు పెట్టాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. 

'గద్దర్' అవార్డుకు ఎంపిక అవ్వడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. 

Updated Date - Mar 09 , 2026 | 11:51 AM