సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సిరివెన్నెలకు నిజమైన వారసుడు.. రామజోగయ్య శాస్త్రి

ABN, Publish Date - Nov 03 , 2026 | 09:48 AM

ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రికి దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరిట పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్ తేజ, డా. ఓలేటి పార్వతీశం ఆయన రచనలను ప్రశంసించారు.

Ramajogayya Sastry

సందర్భోచిత పాటలు వైవిధ్యభరితంగా, అద్భుతంగా రాయగలిగే వారిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి (Devulapalli Krishnasastri) కి సమానం రామ జోగయ్యశాస్త్రి (Ramajogayya Sastry) అని ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja) పేర్కొన్నారు. వంశీ ఆర్ట్ థియేటర్స్ (Vamshi Art Theatres), లేఖిని రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో సోమవారం రాత్రి త్యాగరాయ గానసభ (Sri Thyagaraya Gana Sabha) లో ప్రముఖ భావకవి దేవుపల్లి కృష్ణశాస్త్రి జయంతి సందర్భంగా ఆయన పేరిట ప్రముఖ గీత రచయిత రామజోగయ్యశాస్త్రికి అవార్డు ప్రదానం సభ జరిగింది.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుద్దాల అశోక్ తేజ సినీ దర్శ కుడు రేలంగి నరసింహారావు తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొ. కూరపాటి వెంకట నారాయణతో కలిసి రామజోగయ్య శాస్త్రికి బహూకరించి మాట్లాడారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతాలు మల్లెల గుబాళింపు అని అభివర్ణించారు. ప్రముఖ సాహితీవేత్త డా. ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వవైభవం ఆవి ష్కరణ చేస్తూ భావకవిత్వంను గ్రామగ్రామాన ప్రచారం చేసిన దేవులపల్లి చేసిన సాహితీసేవ అపూర్వం అన్నారు. రామజోగయ్య తన గురువు సిరివెన్నెల సీతారామశాస్త్రికి నిజమైన వారసుడు అన్నారు. సుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2026 | 09:48 AM