సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'ఎల్ల‌మ్మ'.. నేను చేయ‌లేనని త‌ప్పుకున్న‌ కీర్తి సురేశ్!

ABN, Publish Date - Mar 18 , 2026 | 02:06 PM

దేవిశ్రీ ప్రసాద్ హీరోగా 'బలగం' వేణు దర్శకత్వంలో దిల్ రాజు 'ఎల్లమ్మ' సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ముందు అనుకున్నట్టు కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటించడం లేదని తెలుస్తోంది.

Keerthi Suresh

ఏ ముహూర్తాన ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'ఎల్లమ్మ' ప్రాజెక్ట్‌ను ప్రకటించాడో కానీ దానికి వస్తున్న అవాంతరాలు అన్నీ ఇన్నీ కావు. నాని హీరోగా మొదలు కావాల్సిన ఈ ప్రాజెక్ట్ ముగ్గురు, నలుగురు హీరోల దగ్గరకు వెళ్ళింది. ఎవరికి వారు సబ్జెక్ట్ అద్భుతం అంటూనే ప్రాజెక్ట్‌లోకి మాత్రం ఎంటర్ కాలేదు. చివరకు ఎప్పుడో హీరోగా పరిచయం కావాల్సిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ను 'ఎల్లమ్మ'తో పరిచయం చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. ఆయనతో ఓ చిన్నపాటి గ్లింప్స్ కూడా విడుదల చేశారు. అయితే... హీరోల విషయంలోనే కాదు హీరోయిన్ల విషయంలోనూ చాలానే చర్చ జరిగింది. మొదట సాయి పల్లవిని అనుకున్నారు. చివరకు కీర్తి సురేశ్‌ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు తెలిపారు. కానీ ఇప్పుడు ఆమె కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.


ఎప్పుడైతే దేవిశ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టాడో... అప్పుడు కీర్తి సురేశ్‌ ఇందులోంచి వైదొలగిందని అంటున్నారు. తానీ సినిమాలో నటించలేనని కీర్తి సురేశ్‌ సున్నితంగా చెప్పి తప్పుకుందని తెలుస్తోంది. సో... ఇప్పుడు హీరోయిన్ వేట మళ్ళీ మొదటికి వచ్చింది. సహజంగా దిల్ రాజు వంటి నిర్మాత సినిమాలో అవకాశం ఇస్తే ఏ హీరోయిన్ అయినా 'కాదు, కుదరదు' అని చెప్పరు. కానీ ఈ మధ్య కాలంలో దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న సినిమాలు సైతం కొన్ని ఆశించిన స్థాయిలో ఆడలేదు. సో... తమ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని కొంతమంది హీరోయిన్లు నిర్మొహమాటంగానే నిర్ణయం తీసుకుంటున్నట్టు అర్థమౌతోంది. అలానే కీర్తి సురేశ్‌ సైతం ఎలాంటి మొహమాటం లేకుండా తన మనసులోని మాట చెప్పిందని అంటున్నారు. మరి ఇప్పుడీ ప్రాజెక్ట్‌లోకి హీరోయిన్‌గా ఎవరు అడుగు పెడతారనేది చూడాలి.

Updated Date - Mar 18 , 2026 | 04:22 PM