ఎన్టీఆర్ నీల్.. కొత్త డైరెక్టర్ చేతికి
ABN, Publish Date - May 05 , 2026 | 04:20 PM
ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాల్లో ఎన్టీఆర్ నీల్ (NTRNEEL) ఒకటి. దేవర తరువాత ఎన్టీఆర్ (NTR) నటిస్తోన్న చిత్రం ఎన్టీఆర్ నీల్. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ని ఖరారు చేశారు.
ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాల్లో ఎన్టీఆర్ నీల్ (NTRNEEL) ఒకటి. దేవర తరువాత ఎన్టీఆర్ (NTR) నటిస్తోన్న చిత్రం ఎన్టీఆర్ నీల్. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తోంది. ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఎన్టీఆర్ నీల్ .. వేరే డైరెక్టర్ చేతికి వెళ్ళిందట. అంటే నీల్ తప్పుకున్నాడా అంటే.. కాదు.. ఈ సినిమా గత కొన్ని నెలలుగా ఆటంకాలను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఈమధ్యనే వాటన్నింటిని దాటుకొని డ్రాగన్ సెట్స్ మీదకు వెళ్ళింది. ఎలాగైనా అనుకున్న సమయానికి ఈ చిత్రాన్ని ఫినిష్ చేయాలని నీల్.. కొన్ని బాధ్యతలను డైరెక్టర్ దేవా కట్టాకు అప్పగించినట్లు సమాచారం. డ్రాగన్ లోని కొన్ని యాక్షన్ సీన్స్ కి దేవా కట్టానే దర్శకత్వం వహించబోతున్నారని టాక్. ఇప్పటికే వారణాసి సినిమాకు రైటర్ గా పనిచేస్తోన్న ఆయన.. ఎన్టీఆర్ నీల్ సినిమాకు కూడా డైలాగ్స్ ని అందించనున్నారని సమాచారం.
డైరెక్టర్ గా దేవా కట్టా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయన మాటలు.. తూటాలుగా పేలుతూ ఉంటాయి. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ సినిమాలే అందుకు ఉదాహరణ. ఇక డ్రాగన్ లో కూడా దేవా కట్టా డైలాగ్స్ హైలైట్ గా మారనున్నాయని అంటున్నారు. తెలుగు సినిమా కాబట్టి.. అందులోనూ ఎన్టీఆర్ కావడంతో నీల్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ యాక్టింగ్.. దేవా కట్టా డైలాగ్స్ కి థియేటర్ లో కుర్చీలు విరగాల్సిందే. మరి ఎన్టీఆర్ నీల్ ఎలా ఉండబోతుందో చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.