సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'డ్రాగన్' అంతా సెట్‌! ఇక ఆగేది లేదు.. ఎక్క‌డా త‌గ్గేది లేదు

ABN, Publish Date - May 01 , 2026 | 12:03 PM

'డ్రాగన్' జాప్యంపై మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ ఈ ప్రాజెక్ట్ పురోగతిపై స్పందిస్తూ, ఫ్యాన్స్‌లో ఉన్న సందేహాలకు చెక్ పెట్టారు.

NTR Dragon

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కలయికలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ డ్రాగన్ (Dragon) కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అగ్ర నటుడు, అగ్ర దర్శకుడు కలిసి చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటం సహజం. ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచే నిత్యం వార్త‌ల్లో నిలుస్తూనే వ‌స్తోంది. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా కాలం కావస్తున్నా, ఈ సినిమా విషయంలో జరుగుతున్న జాప్యంపై అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ ఈ ప్రాజెక్ట్ పురోగతిపై స్పందిస్తూ, ఫ్యాన్స్‌లో ఉన్న సందేహాలకు చెక్ పెట్టారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సినిమా పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం 'వార్ 2' ఫలితం, అలాగే మారుతున్న అంతర్జాతీయ సినిమా సమీకరణాల దృష్ట్యా ప్రశాంత్ నీల్ ఈ స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్‌కు సరితూగేలా కథలో మరింత పకడ్బందీ మార్పులు చేయడం కోసమే దర్శకుడు కొంత సమయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఎక్స్ట్రా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, ఇకపై ఎలాంటి జాప్యం లేకుండా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేస్తామ‌ని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది అంటే 2027లో ఈ చిత్రాన్ని వెండితెరపైకి తీసుకురావడమే లక్ష్యంగా చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతేగాక‌ నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లు, ఎన్టీఆర్ పవర్ ఫుల్ మాస్ పర్ఫార్మెన్స్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర మరోసారి రికార్డుల వేట మొదలవ్వడం ఖాయం. ఈ అప్డేట్‌తో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ భారీ యాక్షన్ డ్రామా ఇండియన్ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. దీనికోసం అటు అభిమానులు, ఇటు సామాన్య ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా వేచి చూస్తున్నారు.

Updated Date - May 01 , 2026 | 01:48 PM