రమణి కల్యాణం.. టీజర్ ఇంత బావుందేంటి
ABN, Publish Date - May 12 , 2026 | 10:06 PM
సూర్య వశిష్ట, దీప్సికా చంద్రన జంటగా నటించిన కుటుంబ కథా చిత్రం రమణి కల్యాణం.
సూర్య వశిష్ట (Surya Vashistta), దీప్సికా చంద్రన్ (Deepsikha Chandran) జంటగా నటించిన కుటుంబ కథా చిత్రం రమణీ కల్యాణం (Ramani Kalyanam). విజయ్ ఆదిరెడ్డి (Vijay Adireddy) దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా మంగళవారం రోజున ఈ మూవీ టీజర్ విడుదల చేశారు.
ఈ టీజర్‌ను చూస్తే.. చాలా రోజుల తర్వాత క్లీన్‌ఫ్యామిలీ ఎంటర్ టైన్ సినిమా థియేటర్లకు వస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అంధురాలైనప్పటికీ సమయ స్ఫూర్తి, చలాకీతనం మెండుగా ఉన్న యువతి, ఫెరాలసిస్ వచ్చి వీల్‌చైర్‌కే పరిమితమైన అబ్బాయి మధ్య ప్రేమ, ప్రెమ పెళ్లి అనే అంశాల చుట్టూ సాగుతూ మంచి వినోదం పంచుతుందనే ఫీల్ ఇచ్చేలా టీజర్ ఉంది. మీరూ ఓ లుక్ వేయండి.
నేను.. ఈ సినిమా చూశా
‘ఈమధ్య కాలంలో చిన్న సినిమాల్లో కూడా చాలా మంచి చిత్రాలు వస్తున్నాయి. ‘రమణి కల్యాణం’ కూడా అలాంటి మంచి సినిమానే. ఇందులో హీరో, హీరోయిన్లు అద్భుతంగా నటించారు. సంగీతం కూడా చాలా బాగుంది. నేను ఈ సినిమా చూశాను. మంచి ఫీల్‌గుడ్ మూవీ ఇది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు సీనియర్ నటి జయసుధ.
సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ జంటగా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రమణి కల్యాణం’. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మించారు. సినిమా ఈనెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో టీజర్‌ని జయసుధ ఆవిష్కరించారు.
హీరో సూర్య వశిష్ట మాట్లాడుతూ ‘ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. ఇందులో ఛాలెంజింగ్ రోల్ చేశాను. వీల్‌చైర్‌లో కూర్చొని ఎటూ కదలకుండా నటించడం ఒక సవాల్‌గా అనిపించింది’ అని అన్నారు. ‘ఈ సినిమా ప్రతి ఒక్కరికీ ఒక హోప్‌ని ఇస్తుంది. మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే చిత్రమిది’ అని హీరోయిన్ దీప్షిక చంద్రన్ తెలిపారు. అందరూ థియేటర్‌లో సినిమా చూసి సపోర్ట్ చేయాలని దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి, నిర్మాత శ్రీనాథ్ పసుపులేటి కోరారు.