సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘రాకా’లో.. దీపిక పాత్ర నిడివి ఏం తగ్గించట్లేదు

ABN, Publish Date - Apr 24 , 2026 | 06:16 AM

అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’లో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న విష‌యం తెలిసిందే.

Raaka

అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా అట్లీ (Atlee) తెరకెక్కిస్తున్న ‘రాకా’(Raaka)లో దీపికా పదుకొనే (Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో ఆమె పాత్ర యాక్షన్‌ ప్రధానంగా ఉండనుంది. అయితే, ఇటీవలే ఆమె రెండోసారి తల్లి అయినట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ఈ సినిమాలో ఆమె పాత్రపై సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది.

ఇందులో ఆమె రోల్‌ నిడివిని తగ్గించనున్నారని కొందరు.. షూటింగ్‌ ఆలస్యం అవుతుందని, ఆమె స్థానంలో మరో నటిని తీసుకున్నారని మరికొందరు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై ‘రాకా’ టీమ్‌ స్పందించి, ఆ వార్తలను కొట్టిపడేసింది.

‘ఈ సినిమాలో దీపిక పోషిస్తున్న పాత్ర చాలా కీలకమైంది. అనుకున్న షెడ్యూల్స్‌ ప్రకారమే షూటింగ్‌ ముందుకు సాగుతుంది. దయచేసి రూమర్స్‌ను వ్యాప్తి చేయొద్దు’ అని పేర్కొంది. భారీ బడ్జెట్‌తో సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ఈ యాక్షన్‌ ఫాంటసీని నిర్మిస్తున్నారు.

ఇందులో అల్లు అర్జున్‌ లుక్‌ విభిన్నంగా ఉండనుంది. మేకప్‌ కోసమే ఆయన దాదాపు నాలుగు గంటల సమయాన్ని వెచ్చిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌.

Updated Date - Apr 24 , 2026 | 06:53 AM