Rukmini Vasanth: బికినీ ఇష్యూ.. రుక్మిణి వసంత్ రియాక్షన్
ABN, Publish Date - May 23 , 2026 | 01:36 PM
కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. గ్రీన్ కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో దిగుతున్నట్లు కొన్ని ఫొటోలు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే!
కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. గ్రీన్ కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో దిగుతున్నట్లు కొన్ని ఫొటోలు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే! ఈ వైరల్ క్లిప్‌లో రుక్మిణి చుట్టూ కెమెరాలు, లైట్లు, షూటింగ్ క్రూ ఉన్నట్లు కనిపించడంతో ఏదైనా సినిమా షూటింగా, బ్రాండ్ ప్రమోషన్‌లో పాల్గొన్నారని చాలామంది అనుకున్నారు. ఆ ఫొటోలను సాంకేతిక నిపుణులు పరిశీలించగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో క్రియేట్ చేసిన డీప్ ఫేక్ కంటెంట్ 9Deep Fake videos)అని తెలిసింది. సదరు నటి ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి ఇంతలా తెగించాలా అంటూ అభిమానులు మండిపడుతున్నారు. ఆ ఫొటోలు, వీడియోలను క్రియేట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై రుక్మిణి వసంత్ కూడా స్పందించారు. ఈ మేరకు ఓ నోట్ విడుదల చేశారు. ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నా ఫొటోలు ఏఐ ద్వారా క్రియేట్ చేయబడినవని నేను, నా టీమ్ గుర్తించాము. ఇలా మార్ఫింగ్ చేయడం, ప్రచారం చేయడం బాధ్యాతారాహితమైన చర్య. ఇది నా వ్యక్తిగత గోప్యతకు తీవ్రమైన భంగం కలిగిస్తుంది. దీనిని నేను, నా టీమ్ సీరియస్‌గా తీసుకున్నాం. ఈ చర్యలకు పాల్పడినవారిపై సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఫిర్యాదు చేయనున్నాం. చట్టపరమైన చర్యలు తప్పవు’ అని పేర్కొన్నారు.
రుక్మిణి వసంత్ తెరపై ఎంతో సంప్రదాయబద్దంగా కనిపిస్తారు. ఒకసారిగా ఇలాంటి దుస్తుల్లో కనిపించే సరికి కొందరు నెటిజన్లు అనవసరంగా ఆమె మోరాలిటీని ప్రశ్నిస్తూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఆ వీడియోలు నిజమా, కాదా అన్నది కూడా ఆలోచించకుండా ఓ మహిళ వ్యక్తిగత స్వేచ్ఛను, ప్రైవసీని దెబ్బతీసేలా మాట్లాడారు. సైబర్ నేరగాళ్ల కంటే ఇలాంటి వారి ఆలోచనలు మరింత ప్రమాదకరం అని అభిమానులు మండిపడుతున్నారు. ‘ఇది ముమ్మాటికీ ఫేక్ వీడియోనే.. దీని వెనుక ఉన్న ఆకతాయిలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు’ అంటూ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇస్తున్నారు రుక్మిణి ఫ్యాన్స్. చిత్ర పరిశ్రమ, సైబర్ క్రేౖమ్ పోలీసులు కలిసి ఇలాంటి సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.