Ego Raja: త‌మిళంలోకి ఎంట్రీ.. లుంగీలో స్టెప్పుల‌తో అదరగొట్టిన ఆది సాయికుమార్

ABN , Publish Date - Nov 09 , 2026 | 05:43 PM

శంబాల విజయంతో జోష్ మీదున్న ఆది సాయికుమార్ ఇప్పుడు ‘ఈగో రాజా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా విడుదలైన ‘రౌడీ రాకాసి’ పాటలో లుంగీతో వేసిన హుక్ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Aadi Saikumar, Ego Raja

‘శంబాల’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ (Aadi Saikumar) డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’ (Ego Raja) అంటూ ఆడియెన్స్‌ని పలకరించేందుకు ముస్తాబ‌య్యాడు. ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదితో పాటు సతీష్ (Sathish), శరణ్య రామచంద్రన్ (Saranya Ramachandran), ఆద్య ప్రసాద్ (Aadhya Prasad) ప్రధాన పాత్రల్లో నటిస్తుండ‌గా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో ఆది కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తుండ‌డం విశేషం.

ఇక ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వదిలిన పోస్టర్‌లు, పాటలు అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ఆది సాయికుమార్‌ రా అండ్ రస్టిక్ ఫ‌స్ట్ లుక్‌ అందరినీ ఆకట్టుకోగా తాజాగా ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ (Rowdee Raakasi Video Song ) అంటూ సాగే ఓ క్యూట్ లవ్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఇక ఇందులో ఆది స్టెప్పులు, హీరో హీరోయిన్ ట్రాక్, పాటను చిత్రీకరించిన తీరు ఎంతో అందంగా ఉంది. అయితే పాట‌లో హీరోకు చాలా సంద‌ర్భాల్లో లింప్ సిక్ మిస్ అయిన‌ట్లు స్ప‌ష్టంగా తెలియ వ‌స్తుంది.

ఇదిలాఉంటే.. లుంగీలో ఆది వేసిన హుక్ స్టెప్పులు ఇన్స్టంట్‌గా వైరల్ అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి . ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం, గిబ్రాన్ వైబోధ అందించిన బాణీ, శిభి శ్రీనివాసన్ గాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, గిబ్రాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. దురైరాజ్ ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Updated Date - Nov 09 , 2026 | 05:54 PM