సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దసరా పండక్కి స్పెషల్ ట్రీట్.. టాలీవుడ్ నుంచి పోస్టర్ల పండగ

ABN, Publish Date - Oct 21 , 2026 | 12:09 PM

పర్వదినాలు వస్తున్నాయంటే చాలు- పరవశించి పోతూ తమ సినిమాల విశేషాలతో వచ్చేస్తారు సినీజనం. దసరా పండగ రోజున అనేక మూవీస్ పోస్టర్స్ జనం ముందు నిలచి కనువిందు చేశాయి. ఆ సినిమాలేవో మరి !?..

Dasara 2026, Telugu Movies

పదిరోజుల పండగ దసరా (Dasara). విజయదశమిన పలు చిత్రాల షూటింగ్స్ మొదలయ్యేవి. పూజా కార్యక్రమాలు సాగేవి. లేదా తమ చిత్రాల విశేషాలను జనానికి తెలియపరచాలని మేకర్స్ తపించే వారు. ఈ ముచ్చట్లలో కొన్ని మాత్రమే ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి దసరా పండగకు పలువురు మూవీమేకర్స్ తమ సినిమాల పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలపడం విశేషం. దాదాపు 14 చిత్రాల పోస్టర్స్ దసరా నాడు సందడి చేశాయి. అన్నిటా డిజైనర్స్ ఎవరికి వారు తమ క్రియేటివిటీ ప్రదర్శించే ప్రయత్నం చేశారు.

శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా తెరకెక్కుతోన్న 'ఆస్మాన్' పోస్టర్ లో హీరో-హీరోయిన్ ఎదురెదురుగా కూర్చుని వరైటీగా కనిపించింది. దసరా రోజు కాబట్టి 'రావణదహనం' చేసే బొమ్మతో 'డ్యూ డేట్ ' పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 'హైలెస్సో', 'బబ్లూ ఎక్స్ ఎక్స్ ఎల్', 'హుషారు-2' చిత్రాల పోస్టర్స్ సైతం తమదైన శైలిలో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాయి. గోపీచంద్ హీరోగా సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'భరతవర్ష' సినిమా నుండి "అమ్మా కదిలి వచ్చె." లిరికల్ ఐదు రోజుల క్రితం విడుదలయింది. ఈ పాట అప్పుడే 5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడాన్ని 'భరతవర్ష' టీమ్ సంతోషంగా ప్రకటించుకుంది.

మరికొందరు తమ సినిమాల రిలీజ్ డేట్స్ తో దసరా శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని చిత్రాల విడుదల తేదీలను ఇప్పటికే ప్రకటించినా, మరోమారు దసరానాడు తమ రిలీజ్ డేట్స్ తెలిపారు మూవీ మేకర్స్. అలా వెలుగు చూసిన పోస్టర్స్ లో శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కిస్తోన్న 'జార్జ్ క్రిష్' మూవీ జనవరి 14న సంక్రాంతి కానుకగా రానుందని తెలిపారు. ఇక ఈ యేడాది నవంబర్ 27న బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన 'హైందవ' మూవీ రిలీజ్ డేట్ తో పోస్టర్ ప్రత్యక్షమయింది.

అలాగే డిసెంబర్ 4వ తేదీన జనం ముందుకు వస్తున్నట్టు నాగచైతన్య హీరోగా రూపొందిన 'వృషకర్మ' సినిమా పోస్టర్ వెలుగు చూసింది. డిసెంబర్ 4వ తేదీనే 'అలియాస్ రుక్మిణీ' రిలీజ్ అవుతోంది. ఆ పోస్టర్ సైతం వెలుగు చూసింది. డిసెంబర్ 25వ తేదీన ప్రేక్షకులను పలకరిస్తామన్నట్టు కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన 'రియాలిటీ' పోస్టర్ దర్శనమిచ్చింది.

యదు వంశీ దర్శకత్వంలో తన అన్న వరుణ్‌ తేజ్ హీరోగా నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న 'బరి' పోస్టర్ కూడా దసరాకు వెలుగు చూసింది. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులయింది. అయితే దసరా శుభాకాంక్షల పోస్టర్ లో మాత్రం 'భూమి పూజతో మొదలైన...' అంటూ పేర్కొనడం విశేషం. ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆకాశంలో ఒకతార' సినిమా పోస్టర్ సైతం దసరా రోజున వెలుగు చూసింది. ఈ సినిమా నవంబర్ 20న వస్తుందని లోగడ ప్రకటించారు.

అయితే మేకర్స్ ఈ పోస్టర్ లో విడుదల తేదీని పేర్కొనలేదు. దసరా నాడు రిలీజైన పోస్టర్స్ లో ఎక్కుమంది జనాన్ని ఆకర్షించిన పోస్టర్స్ 'బరి', 'ఆకాశంలో ఒక తార' కావడం విశేషం. టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలకు సంబంధించిన సినిమా పోస్టర్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. దసరా శుభాకాంక్షలు తెలుపుతూ తమ పోస్టర్స్ ను రిలీజ్ చేసిన మేకర్స్ తమ సినిమాలతో ఏ తీరున సందడి సాగిస్తారో చూడాలి.

Updated Date - Oct 21 , 2026 | 12:19 PM