Prabhas: అబ్బబ్బా.. ఏమున్నాడ్రా బాబు! ప్రభాస్ న్యూ.. 'స్పిరిట్' లుక్ వైరల్
ABN, Publish Date - May 15 , 2026 | 09:46 AM
ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం స్పిరిట్ నుంచి ప్రభాస్ పంచెలో ఉన్న ఓ స్టిల్ ఇంటర్నెట్‌లో లీక్ అయి సంచలనం సృష్టిస్తోంది.
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’ (Spirit). ప్రస్తుతం వరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి రోజుకో రకమైన ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చి ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇస్తుండగా యూనిట్‌కు మాత్రం షాకుల మీద షాకులు ఇస్తున్నాయి.
తాజాగా ఈ చిత్రం నుంచి ప్రభాస్‌కు సంబంధించి ఓ స్టిల్ లీక్ అయిందనే వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సాంప్రదాయ పంచెకట్టులో ప్రభాస్ కనిపిస్తున్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాను దున్నేస్తుంది. ఈ ఫొటో చూసిన వారంతా డార్లింగ్ ఏమున్నాడ్రా బాబు. ఈ కటౌట్‌ను కొట్టే మొనగాడు దేశంలోనే లేడు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. నిన్నటి నుంచి (గురువారం) బాగా వైరల్ అవుతున్న ఈ ఫొటో నిజంగా సినిమా సెట్స్ నుంచి లీక్ అయిందా? లేక ఫ్యాన్‌మేడ్ క్రియేషన్? ఏమైనా అయి ఉంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏద ఎలా ఉన్నా ప్రభాస్ ఈ నయా లుక్ స్టిల్ మాత్రం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.