సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అతీంద్రియ శక్తుల నేపథ్యంలో పూర్ణ చిత్రం!

ABN, Publish Date - Mar 10 , 2026 | 02:20 PM

పూర్ణ, త్రిగుణ్‌, శుభశ్రీ రాయగురు ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'డార్క్ నైట్'. ఈ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ మార్చి 13న విడుదల కాబోతోంది.

Poorna Dark Night Movie

ప్రముఖ నటి పూర్ణ (Poorna) ప్రధాన పాత్రను పోషించిన ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ 'డార్క్ నైట్' (Dark Night). ఈ సినిమాను మార్చి 13న రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయబోతున్నారు. జి. ఆర్. ఆదిత్య ఈ సినిమాకు కథను రాసి, దర్శకత్వం వహించారు. ఇందులో హేమ అనే పాత్రను పూర్ణ పోషిస్తున్నారు. ఆమెతో పాటు త్రిగుణ్‌.. రోషన్ గానూ, విధార్థ్‌... అలెక్స్ గానూ, శుభశ్రీ రాయగురు సోఫియా పాత్రలోనూ నటిస్తున్నారు. మిస్కిన్ సంగీతం అందించిన ఈ సినిమాను పట్లోళ్ళ వెంకట్ రెడ్డి సమర్పణలో సురేశ్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు.


నిర్మాత ఈ సినిమా గురించి మాట్లాడుతూ, 'డార్క్ నైట్‌ మూవీ కథ నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది. వారి మధ్య ఉన్న సంక్లిష్ట భావోద్వేగాలు, రహస్యాలు, సంఘర్షణలు కథను ఉత్కంఠ భరితంగా మలుస్తాయి. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రేక్షకులు భావోద్వేగాలతో నిండిన ప్రయాణాన్ని అనుభవిస్తారు. ఈ చిత్రంలో అతీంద్రియ అంశాలతో కూడిన ఒక ఊహించని ట్విస్ట్... కథను కొత్త మలుపు తిప్పుతూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. మిస్కిన్ ప్రత్యేకమైన సిగ్నేచర్ మ్యూజిక్‌తో మరుపురాని సినిమాటిక్ అనుభవాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా రెండు గంటలపాటు ఉత్కంఠభరితంగా, పాత్రలతో మమేకం అయ్యేలా చేస్తుంది' అని అన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 02:26 PM