Janhvi Kapoor: బరువు తగ్గాలంటే.. చరణ్ తో డ్యాన్స్ చేయండి
ABN, Publish Date - May 25 , 2026 | 08:23 PM
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్ది(Peddi). ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా జూన్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్ది(Peddi). ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా జూన్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్.. పెద్ది టూర్ ని నిర్వహిస్తోన్న విషయం తెల్సిందే.
ఇప్పటికే భోపాల్ లో సాంగ్ లాంచ్ ఈవెంట్ అయ్యాక.. పెద్ది టీమ్ బెంగుళూరులో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ ఈవెంట్ కి ఆయనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ వేడుకలో జాన్వీ.. రామ్ చరణ్ గురించి చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
' మీరు ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే.. చరణ్ తో డ్యాన్స్ చేయండి. హాఫ్ డే లో తగ్గిపోతారు' అని చెప్పుకొచ్చింది. అంతకుముందు చరణ్ ఒక ఈవెంట్ లో నాకన్నా జాన్వీ డ్యాన్స్ బాగా చేస్తుంది అని చెప్పాడు. ఇలా ఇద్దరూ ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం బావుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో జాన్వీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.