దాదా ధమాకా.. దద్దరిల్లిపోతుంది ఇలాకా
ABN, Publish Date - Nov 13 , 2026 | 08:11 PM
నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దాదా(Dada).
నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దాదా(Dada). వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోండగా మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మొదటి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.
దాదా ధమాకా అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ అందించిన ఊరమాస్ బీట్స్ ఈ పాటకు ప్రాణం పోశాయి. ఈ పాటలో బాలయ్య బాబు ఎనర్జిటిక్ స్టెప్పులు, ఆయన వేసే మాస్ స్టెప్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రి అందాల అరబోత నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఆమె గ్లామర్ అండ్ డాన్స్ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రామజోగయ్యశాస్త్రి అందించిన లిరిక్స్ అన్ని ఒక ఎత్తు అయితే.. బాలయ్య ఈ సాంగ్ కి గొంతు అందించడం మరో ఎత్తు. బాలయ్య హస్కీ వాయిస్ లో ఈ సాంగ్ వింటుంటే చాలా బావుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
ఇక బాలయ్య ఐటెమ్ సాంగ్స్.. మాస్ స్టెప్పులు డెడ్లీ కాంబినేషన్. ఈ సాంగ్ లో కూడా అలాంటి స్టెప్పులతో శేఖర్ మాస్టర్ అదరగొట్టేశాడు. బాలయ్య స్వాగ్, స్టైల్, నర్గీస్ అందాలు.. థమన్ మ్యూజిక్ మొత్తం కలిపి ఈ సాంగ్ నిజంగానే ధమాకాలా పేలుతోంది .. సోషల్ మీడియా ఈ సాంగ్ తో దద్దరిల్లిపోతుంది. ముఖ్యంగా ఈ సాంగ్ రీల్స్ తో మంచి ట్రెండ్ అయ్యేలానే అనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ఘాట్ ఫినిష్ కావాల్సింది. కానీ, బాలయ్యకి ప్రమాదం జరగడంతో కొంతవరకు వాయిదా పడిన ఈ సినిమా ఘాట్ ఈమధ్యనే ఆయన మళ్లీ సెట్ లో అడుగుపెట్టడంతో మొదలయ్యింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దాదా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న రిలీజ్ కానుంది. వీరసింహారెడ్డి లాంటి హిట్ సినిమా తరువాత బాలయ్య - గోపీచంద్ మలినేని దాదాతో ఎలాంటి హిట్ ని అందుకుంటారో చూడాలి.