సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'డెకాయిట్' నిర్మాతల కీలక ప్రకటన

ABN, Publish Date - Feb 28 , 2026 | 12:55 PM

అడివి శేష్‌, మృణాల్‌ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'డెకాయిట్' సినిమాను నుండి పాట విడుదలైంది. ఇదే సందర్భంగా సినిమా విడుదలను ఏప్రిల్ 10కి వాయిదా వేసినట్టు మేకర్స్ తెలిపారు.

Decoit Movie

ప్రముఖ కథానాయకుడు అడివి శేష్ (Adivi Sesh) ఇప్పుడు పూర్తిగా కొత్త అవతార్‌లో 'డెకాయిట్‌' (Dacoit) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా మదనపల్లె స్లాంగ్‌లో డైలాగులు చెప్పడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటిస్తున్నారు. షానియల్ డియో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి 'రుబారూ' అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు భీమ్స్ (Bheems Ceciroleo) స్వరాలు సమకూర్చగా, ఆయనతో పాటు చిన్మయి పాడారు. రస్టిక్ టచ్‌తో మెలోడీని ఎలివేట్ చేసేలా ఈ పాట సాగింది. భాస్కరభట్ల రవికుమార్ రాసిన ఈ పాట ఒక యువకుడి ప్రేమను, ఆ ప్రేమ తర్వాత జరిగిన ద్రోహాన్ని, ఆ పైన అతని జీవితంలో వచ్చిన మార్పునూ సూచిస్తోంది.


అడివి శేష్ – మృణాల్ జంట మధ్య ఉన్న నేచురల్‌ కెమిస్ట్రీ ఈ పాటకు ఎమోషనల్ పవర్‌గా మారింది. వారి ప్రేమలోని మాధుర్యం, తరువాత జరిగే ద్రోహం వల్ల కలిగే బాధ ఇవన్నీ ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పాట సినిమా కథలో ఒక కీలక మలుపు కాబోతోందని తెలుస్తోంది. విశేషం ఏమంటే... ఈ పాట విడుదల సందర్భంగా 'డెకాయిట్' తాజా రిలీజ్ డేట్‌ను మేకర్స్ తెలిపారు. నిజానికి ఈ సినిమా మార్చి 19న రావాల్సి ఉంది. కానీ అదే రోజున పాన్ ఇండియా చిత్రాలు 'ధురంధర్ 2', 'టాక్సిక్‌' విడుదల అవుతుండటంతో 'డెకాయిట్‌'ను ఏప్రిల్ 10కి వాయిదా వేశారు. అయితే అదే రోజున నిఖిల్ నటిస్తున్న 'స్వయంభూ' కూడా విడుదల కావాల్సి ఉంది. మరి ఆ సినిమా వాయిదా పడుతుందేమో చూడాలి. 'డెకాయిట్' మూవీని సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్‌ దీనికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు జ్ఞాని నేపథ్య సంగీతం సమకూర్చుతున్నారు.

Updated Date - Feb 28 , 2026 | 01:53 PM