సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'గాడ్ ఆఫ్ వార్'.. నుంచి క్రేజీ అప్డేట్! ఇక ర‌చ్చ ర‌చ్చే

ABN, Publish Date - Apr 17 , 2026 | 06:38 AM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) లైనప్‌లో ఉన్న చిత్రాలు చూస్తుంటే లైనప్‌లో తన కెరీర్ లోనే అత్యంత పవర్ ఫుల్ చిత్రాలను లైన్‌లో పెట్టినట్లు స్పష్టమవుతోంది.

God of War

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) లైనప్‌లో ఉన్న చిత్రాలు చూస్తుంటే లైనప్‌లో తన కెరీర్ లోనే అత్యంత పవర్ ఫుల్ చిత్రాలను లైన్‌లో పెట్టినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో డ్రాగన్ (Dragon) అనే మూవీ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా తర్వాత తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఆయన చేయబోయే చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన 'అరవింద సమేత' సృష్టించిన ఇంపాక్ట్ దృష్ట్యా, ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కుమారస్వామి (Kumaraswamy) నేపథ్యంలో సాగనున్నట్లు అవగతమవుతోంది. గతంలో ఎన్నడూ చూడని రీతిలో, ఒక ఊహించని స్కేల్‌లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా, కథలో ఆధ్యాత్మిక అంశాలను మిళితం చేస్తూ ఒక విజువల్ వండర్‌గా దీనిని తీర్చిదిద్దేందుకు త్రివిక్రమ్ కసరత్తులు చేస్తున్నారు. తారక్ మాస్ ఇమేజ్‌కు, త్రివిక్రమ్ క్లాసిక్ మేకింగ్‌కు ఈ నేపథ్యం తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం.

అభిమానులకు అత్యంత సంతోషాన్నిచ్చే విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ రాబోతోందట. ఈ చిత్రానికి గాడ్ ఆఫ్ వార్ (God Of War) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిలింనగర్ టాక్. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. టైటిల్‌లో ఉన్న గాంభీర్యం చూస్తుంటే, ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక ఉగ్ర రూపంలో కనిపించనున్నారని అర్థమవుతోంది.

పుట్టినరోజు హడావిడి కేవలం త్రివిక్రమ్ సినిమాతోనే ఆగడం లేదు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమా అప్‌డేట్ కూడా ఆరోజే ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్‌మెంట్ కూడా తోడైతే, నందమూరి అభిమానులకు అది ఒక ఊహించని సర్ప్రైజ్ అని చెప్పాలి. వరుసగా రెండు భారీ చిత్రాల అప్‌డేట్లు రావడం అంటే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు మొదలైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో తన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు నీల్ యాక్షన్ డ్రామా, అలాగే మరోవైపు త్రివిక్రమ్ విజువల్ వండర్ వంటి చిత్రాలు ఆయన ఖాతాలో ఉండటం విశేషం. ఈ అప్‌డేట్లు గనుక అధికారికంగా వెలువడితే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. తారక్ పుట్టినరోజున రాబోయే ఆ 'బిగ్ అనౌన్స్‌మెంట్స్' కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

Updated Date - Apr 17 , 2026 | 06:45 AM