Naresh: పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనండి
ABN, Publish Date - Oct 12 , 2026 | 08:13 AM
నరేష్ విజయకృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ నటించిన క్రేజీ కల్యాణం అక్టోబర్ 16న విడుదల కానుంది.
'నవరసరాయ' డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం (Crazy Kalyanam). ఈ నెల16న ఈ చిత్రం ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఆదివారం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాస్, డైరెక్టర్ నందినీరెడ్డి ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బన్నీ వాస్, దిల్ రాజు మాట్లాడుతూ.. ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని, సినిమా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందని అభిప్రాయపడ్డారు. చిన్న సినిమాలు కూడా విజయాలు సాధించినప్పుడే చిత్ర పరిశ్రమ మరింత కళకళలాడుతుందని దిల్ రాజు అన్నారు. అనుపమ తెలంగాణ యాసలో ఆకట్టుకుందని, నరేష్, తరుణ్ భాస్కర్ తమ నటనతో మెప్పించారని ప్రశంసించారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని నందినీరెడ్డి ఆకాంక్షించారు.
దర్శకుడు బద్రప్ప గాజుల మాట్లాడుతూ.. పెళ్లికి అంగీకరించే అమ్మాయి మనసులోని భావాలు, ఆశల చుట్టూ ఈ కథను రూపొందించినట్లు తెలిపారు. అనుపమకు ఈ కథ బాగా నచ్చిందని, నరేష్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ పాత్రలు సినిమాకు బలంగా నిలుస్తాయని చెప్పారు.
అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాను తనకు నచ్చిన కథగా అభివర్ణించారు. ‘శతమానం భవతి’ తర్వాత అలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎప్పుడు చేస్తారని అడిగేవారికి ‘క్రేజీ కల్యాణం’ సమాధానమని అన్నారు. వినోదం, భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.
నరేష్ విజయకృష్ణ మాట్లాడుతూ.. ‘క్రేజీ కల్యాణం’ నిజాయతీతో రూపొందించిన వినోదాత్మక చిత్రమని, తన కెరీర్‌లోనే ఉత్తమ నటన కనబరిచిన సినిమాల్లో ఇదొకటని అన్నారు. తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కినా ఇందులోని భావోద్వేగాలు అందరికీ కనెక్ట్ అవుతాయని చెప్పారు. తరుణ్ భాస్కర్ తన పాత్రతో నవ్విస్తారని, సినిమాలో ప్రేమ, వినోదం, భావోద్వేగాలు, సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా విడుదలవుతున్న ‘క్రేజీ కల్యాణం’ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.