కపుల్ ఫ్రెండ్లీ: అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ హిట్టే
ABN, Publish Date - Mar 15 , 2026 | 05:54 PM
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం 'కపుల్ ఫ్రెండ్లీ' గత నెల 14న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకోవడంతోపాటు చక్కని వసూళ్లు రాబట్టింది.
సంతోష్ శోభన్ (Santosh Sobhan), మానస వారణాసి (Manasa varanasi) జంటగా నటించిన చిత్రం 'కపుల్ ఫ్రెండ్లీ' (Couple friendly) గత నెల 14న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకోవడంతోపాటు చక్కని వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా సూపర్ రేటింగ్ తో నడుస్తోంది. ఈ సినిమాకు ప్రభాస్ లాంటి స్టార్స్ సైతం సపోర్ట్ గా నిలిచారు. ఆయన చేసిన పోస్ట్ మూవీకి బాగా మైలేజ్ తీసుకొచ్చింది. మంచి మూవీ చేశారంటూ యూత్ సోషల్ మీడియాలో అప్రిషియేట్ చేశారు.
ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ (Prime Videos)లో సినిమా చూస్తున్న ప్రేక్షకులు కపుల్ ఫ్రెండ్లీ మూవీని అప్రిషియేట్ చేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. ఓటీటీలో కూడా సినిమా మంచి విజయం సాధించిందని మేకర్స్ తెలిపారు. 'కపుల్ ఫ్రెండ్లీ' చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు.