సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మాజీ సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన బ్రహ్మానందం! ఫొటో వైర‌ల్‌

ABN, Publish Date - Feb 20 , 2026 | 11:50 AM

ఏపీ గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో (GannavaramAirport) శుక్ర‌వారం ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

Brahmanandam YS Jagan

ఏపీ గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో (Gannavaram Airport) శుక్ర‌వారం ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (YS Jagan) ని ప్ర‌ముఖ తెలుగు హాస్య న‌టుడు, హాస్య బ్ర‌హ్మ‌ బ్ర‌హ్మానందం (Brahmanandam) క‌లుసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

వివ‌రాల్లోకి వెళితే.. వ్య‌క్తిగ‌త ప‌ని నిమిత్తం బ్ర‌హ్మానందం శుక్ర‌వారం ఉద‌యం హైద‌రాబాద్ నుంచి బ‌య‌లు దేరి గ‌న్న‌వ‌రం ఏయిర్ పోర్టులో దిగారు. అదే స‌మ‌యంలో మాజీ సీఎం జ‌గ‌న్ అక్క‌డే ఉండ‌డంతో బ్ర‌హ్మానందం మ‌ర్యాద‌పూర్వ‌కంగా వెళ్లి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కాసేపు ఇరువురు కుశ‌ల ప్ర‌శ్న‌లు వేసుకుని ఆత్మీయంగా మాట్లాడుకున్న అనంత‌రం అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - Feb 20 , 2026 | 04:18 PM